Nepal Palace Massacre: ప్రేమకు బలైన నేపాల్ రాజ కుటుంబం.. ప్యాలెస్‌లో ఊచకోత.. ఆ నాటి విషాద గాథ
- రాజకుటుంబాన్ని ఊచకోత కోసిన యువరాజు దీపేంద్ర..
- ప్రేమ వ్యవహారంతో నేపాల్ రాజ కుటుంబం హత్య..
- నేపాల్ రాచరికం అంతమవ్వడానికి మొదటి కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Palace Massacre: నేపాల్‌లో సోషల్ మీడియా బ్యాన్‌కు వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ నిరసనలకు తలొగ్గి ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. ఆయన మంత్రివర్గంలోని పలువురు మంత్రులు కూడా రాజీనామాలు చేశారు. ఇప్పుడు నేపాల్‌లో మరోసారి రాచరికం మళ్లీ వస్తుందా అనే వాదన మొదలైంది. చాలా మంది నేపాలీలు మరోసారి రాజు పాలన రావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, 2001లో ఆ దేశాన్ని కుదిపేసిన రాజకుటుంబం ఊచకోత మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనే, నేపాల్‌లో రెండు శతాబ్ధాల రాచరికానికి అంతం పలికేలా చేసింది. 2008లో రాచరికం ముగిసి, ప్రజాస్వామ్యం వచ్చింది.
నారయణహితి ప్యాలెస్‌లో ఏం జరిగింది..?
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
అది జూన్ 1, 2001 రాజ కుటుంబం ఖాట్మాండులోని నారాయణహితి ప్యాలెస్‌లో సమావేశమైంది. ప్రతీ శుక్రవారం ఇలా రాజ కుటుంబం గెటు టూ గెదర్‌లో కలుసుకోవడం ఒక అనవాయితీగా ఉంది. ఇలాగే ఆ రోజు కూడా రాజకుటుంబం చాలా ఉల్లాసంగా పార్టీ చేసుకున్నారు. అయితే, ఆ సాయంత్రమే రాజ కుటుంబం, తమ సొంత యువ రాజు చేతిలో ఊచకోతకు గురవుతామని ఊహించలేదు.
ఈ పార్టీకి నేపాల్ రాజు బీరేంద్ర బిర్ బిక్రమ్ షా దేశ్ హాజరయ్యారు. ఆయనే దేశాన్ని పాలిస్తున్నారు. హర్వర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అయిన బీరేంద్ర, భారత్‌లోని డార్జిలింగ్‌లో కూడా చదువుకున్నారు. ఆయన 1970లో ఐశ్వర్య రాజ్యలక్ష్మిదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం- యువరాజు దీపేంద్ర, రాజ కుమార్తె శృతి, చిన్న కుమారుడు నిరాజన్.

అంతా పార్టీలో మునిగి ఉండగా యువరాజు బీరేంద్ర(29) తాగి కనిపించారు. ఆయనను ఓ గదిలో కొద్ది సేపు విశ్రాంతి తీసుకుని, కమాండో డ్రెస్ ధరించి రైఫిల్ చేతపట్టుకుని పార్టీ జరిగే ప్రదేశానికి వచ్చారు. తన తండ్రి, రాజు అయిన బీరేంద్రను చూస్తూ, ఎలాంటి భావోద్వేగం లేకుండా అసాల్ట్ రైఫిల్‌తో కాల్చి చంపాడు. రాజు బీరేంద్ర చనిపోతూ, ‘‘ఏం చేశావు..?’’ అంటూ నేలపై ఒరిగిపోయాడు. దీపేంద్ర తన తల్లి ఐశ్వర్య, సోదరి శృతి, సోదరుడు నిరాజన్లతో పాటు మరో ఐదుగురిని కాల్చి చంపాడు. చివరకు తను తానున కాల్చుకున్నాడు. తుపాకీ గాయంతో కోమాలోకి వెళ్లిన దీపేంద్రను తాత్కాలికంగా రాజుగా ప్రకటించారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత జూన్ 04న మరణించాడు. దీని తర్వాత బీరేంద్ర సోదరుడు జ్ఞానేంద్ర రాజుగా బాధ్యతలు స్వీకరించారు. 2008లో రాజ్యాంగం మారి రాచరికం రద్దయ్యే వరకు ఆయనే చివరి రాజుగా ఉన్నారు.
ప్రేమ కోసమే ఉచకోత, భారత్‌తో సంబంధం:
ప్రభుత్వం ఈ ఊచకోతపై చేపట్టిన విచారణలో దీపేంద్ర ‘‘ప్రేమ కథ’’నే ఈ ఘటనకు కారణమని తెలిసింది. దీపేంద్ర-దేవయానిల రాణా అనే యువతిని ప్రేమించాడు. దేవయాణి నేపాల్ రాజకీయవేత్త పశుపతి షంషేర్ జంగ్ బహదూర్ రాణా కుమార్తె. ఆమె తల్లి ఉషా రాజే సింధియా. గ్వాలియర్ రాజవంశానికి చెందిన వారు. మనదేశానికి చెందిన రాజకీయనాయకులు మాధవరావు సింధియా, వసుంధర రాజేకు బంధువులు.
దీపేంద్ర, దేవయాని యూకేలో కలుసుకున్నారు. కానీ రాజ కుటుంబం ఈ ప్రేమకు అడ్డు చెప్పింది. ముఖ్యంగా దీపేంద్ర తల్లి, రాణి అయిన ఐశ్వర్య ఈ సంబంధాన్ని ఒప్పుకోలేదు. ఒక వేళ దేవయాణిని పెళ్లి చేసుకుంటే యువరాజు హోదాను వదులుకోవాలని హెచ్చరించినట్లు సమాచారం. వేరే రాజ వంశానికి చెందిన అమ్మాయితో కొడుకు దీపేంద్ర వివాహం జరిపించాలని ఐశ్వర్య భావించింది. భారతదేశానికి చెందిన రాజకుటుంబంతో సంబంధం కలుపుకుంటే, ఆ దేశ ప్రభావం తమపై ఎక్కువగా ఉంటుందని రాజ కుటుంబ భయపడినట్లు మరో కారణంగా చెబుతారు. ప్రేమ, రాజకీయం, అధికారం అన్ని కలిసిన నేపాల్ రాజ కుటుంబం ఊచకోత ప్రపంచంలోనే ఆ రోజుల్లో సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..