మొదటి నుంచి భారత్-రష్యా మైత్రి ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలు కూడా అంతే ప్రత్యేకమైనవి. రష్యా అధ్యక్షడు వ్లాదిమిర్ పుతిన్ నేడు భారత్‌కు రానున్నారు. రెండు దేశాల మధ్య జరిగే 21వ వార్షిక సదస్సులో ఆయన పాల్గొంటారు. అంతేకాకుండా భారత్ ప్రధాని నరేంద్రమోడీతో ప్రత్యేకంగా భేటీ అవ్వనున్నారు. వీరి సమావేశానికి ముందు ఇరు దేశాల రక్షణ, విదేశాంగశాఖ ప్రతినిధులు చర్చలు జరుపుతారు. ఈ నేపథ్యంలో పలు కీలక ఒప్పందాలను ఇరు దేశాలు కుదుర్చుకోనున్నాయి. పుతిన్ చివరి సారిగా భారత్‌లో 2018లో పర్యటించారు. ఇప్పటికే రక్షణ రంగంలో రష్యా – భారత్‌కు ఎంతో సాయం చేస్తుంది. ఈ సమావేశంలో విదేశాంగ విధానాలు, రక్షణ ఒప్పందాలు, కోవిడ్‌ను కలిసికట్టుగా ఎదుర్కొంనేందుకు చేయాల్సిన ప్రయత్నాలు, పర్యావరణ హితం కోసం చేపట్టాల్సిన చర్యలు, ఆప్ఘన్‌లో తాలిబాన్ పాలన, సాయం అందించే విషయమై చర్చలు జరిపే అవకాశం ఉంది.
భారత్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న క్షిపణి రక్షణ వ్యవస్థ s-400ను మరింత వేగంగా అందించాలని భారత్ రష్యాను కోరనుంది. దీంతో పాటు రక్షణ రంగంలో పెట్టుబడులు, ఆయుధాల కొనుగోలు వంటి వాటిపై చర్చించనున్నారు. సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంనేందుకు రష్యా అమేథీ సమీపంలోని కోర్వాలో రూ.5వేల కోట్ల రూపాయలతో సంయుక్తంగా నెలకొల్పిన ఫ్యాక్టరీలో 5లక్షల ఏకే-230 రైఫిళ్ల తయారీకి కేంద్రం అనుమతిని ఇచ్చింది.