గాజాలో రెండేళ్ల పాటు బాంబ్ దాడులతో దద్దరిల్లింది. భీకర దాడులతో గాజా కకావికలం అయింది. ఇటీవల గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం జరగడంతో ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. దీంతో ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన జంటలన్నీ ఒకేసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టాయి. మంగళవారం పెద్ద ఎత్తున సామూహిక వివాహాలు జరిగాయి. దీంతో గాజాలో సందడి వాతావరణం నెలకొంది.
ఇది కూడా చదవండి: Shah Rukh Khan: షారూఖ్‌ఖాన్ మార్కుల షీట్ వైరల్.. మ్యాథ్స్‌లో ఎన్ని మార్కులొచ్చాయంటే..!
గాజాలో మంగళవారం 54 జంటలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాయి. గాజాలోని ఖాన్ యూనిస్‌లోని హమద్ నగర్‌లో జరిగిన వేడుకలో 54 పాలస్తీనా జంటలు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుక సందడి.. సందడిగా సాగింది.
ఇది కూడా చదవండి: Delhi: ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై కేంద్రం కొరడా.. 87 యాప్‌లు బ్లాక్
గాజాలో 2 మిలియన్ల మంది నివాసం ఉంటున్నారు. యుద్ధం కారణంగా అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయెల్ జరిపిన బాంబ్ దాడులతో భవనాలు నేలమట్టం అయ్యాయి. యుద్ధ సమయంలో బంధువుల ఇళ్లకు వెళ్లి తలదాచుకున్నారు. ప్రస్తుతం ప్రశాంత వాతావరణం ఉండడంతో తిరిగి ఇళ్లకు వచ్చి వివాహాలు చేసుకుంటున్నారు.