బాలీవుడ్ నటి విద్యా బాలన్ గురించి మూవీ లవర్స్‌కు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ప్రజంట్ సూధీర్ బాబు మూవీ ‘జటాధర’లో నటిస్తోంది. రజనీకాంత్ సరసన నటిస్తోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే కెరీర్ పరంగా ఎలా ఉన్నప్పటికి బయట మాత్రం ముక్కుసూటి మనిషి. ఉన్నది ఉన్నట్టు చెబుతుంది.. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమాల గురించి, నటన గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది..
Also Read : Nitya : మమ్మల్ని ఏదో విధంగా టచ్ చేయాలని చూస్తారు..
‘సినిమా ఇండస్ట్రీలో మార్పు సహజం. పరిస్థితులకు తగ్గట్టు మారుతారు, అది అంగీకరించక తప్పదు. ముఖ్యంగా హీరోయిన్‌లు అవకాశాలకు తగ్గట్లుగా మారుతూ ఉండాలి. అప్పుడే, వారు ఇండస్ట్రీలో ఉంటారు. లేకపోతే ఫేడ్ అవుట్ అవుతారు. నేను నా చిన్న తనంలో చాలా అల్లరి చేసేదాన్ని. ముఖ్యంగా నైట్‌లు ఎక్కువగా మేల్కొనే దాన్ని. ఆ అలవాటు మానేయడానికి నాకు చాలా సమయం పట్టింది. ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే.. నా జీవితాన్ని మార్చేసింది మాత్రం సినిమాలే. పెళ్లి తర్వాత కూడా నేను సినిమాలు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ విద్యాబాలన్ తెలిపింది.