ఈ మధ్య కాలంలో వివాహ బంధానికి విలువే లేకుండా చేస్తున్నారు కొంతమంది. చిన్న చిన్న కారణాలకు విడాకులు తీసుకొని భార్యభర్తల బంధాన్ని అవహేళన చేస్తున్నారు. తాజాగా ఒక భర్త.. భార్య చేసిన చిలిపి పనికి గొడవపెట్టుకొని విడాకులు ఇచ్చిన ఘటన జోర్డాన్ దేశంలో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. జోర్డాన్ కి చెందిన ఒక వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. భార్య, తల్లితో సంతోషంగా నివసిస్తున్నాడు. అయితే కోడలికి, ఆమె అత్తగారు నిద్రపోయేటప్పుడు గురక పెడుతుండడం నచ్చేదికాదు. ఆమె రూమ్ లో పెట్టే గురక పక్కరూం లో ఉన్న కోడలి వరకు వచ్చేది. దీంతో విసుగు చెందిన కోడలికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. ఒక రోజు రాత్రి అత్తగారు గురక పెట్టడం అంతా రికార్డ్ చేసి.. ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లో పెట్టింది. అదివిన్న బంధువులు సదరు భర్తను, ఆమె తల్లిని అవహేళన చేయడం మొదలుపెట్టారు. దీంతో బార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఏదో సరదాకి చేశానని భార్య చెప్పినా.. దాని వలన తమ పరువు పోయిందని తెలుపుతూ భార్యకు విడాకులిచ్చేసాడు. చిన్న కారణంతో విడిపోయిన జంటల జాబితాలో ఈ జంట కూడా చేరిందని చుట్టుపక్కలవారు తెలుపుతున్నారు. గత దశాబ్ద కాలంగా జోర్డాన్‌లో విడాకుల కేసులు బాగా పెరిగాయని అక్కడి మీడియా తెలుపుతుంది.