Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Man Arrested In Poland Over Suspected Plot To Kill Ukraines Zelensky

Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ హత్యకు కుట్ర..

Published Date :April 19, 2024 , 7:43 am
By BV Reddy
Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ హత్యకు కుట్ర..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షడు వొలోడిమిర్ జెలన్ స్కీ హత్యకు కుట్ర పన్నిన ఒక వ్యక్తిని పోలాండ్‌లో అరెస్ట్ చేశారు. రష్యా ఇంటెలిజెన్స్ సర్వీస్ తరుపున కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలాండ్, ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్లు గురువారం తెలిపారు. పావెల్ కే అనే పేరు కలిగిన పోలాండ్ జాతీయుడు, రష్యన్ మిలిటరీ ఇంటెలిజెన్స్‌కి సమాచారం అందించాడని, జెలన్స్కీని హత్య చేయడానికి ప్లాన్ చేశాడని, ఇందుకు రష్యా ప్రత్యేక దళాలు సాయం చేసినట్లు నిందితుడిపై ఆరోపణలు మోపపబడ్డాయి. రష్యన్ ఫెడరేషన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్‌తో తాను పనిచేయడంతో పాటు ఉక్రెయిన్ యుద్ధంలో నేరుగా పాల్గొన్న రష్యన్ పౌరులతో ఇతడికి సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇతడిపై ఆరోపణలు నిరూపించేందుకు అధికారులు సాక్ష్యాలు సేకరిస్తున్నారు.

Read Also: Lok Sabha Elections: నామినేషన్ పత్రాల్లో లెటెస్ట్ ఫోటోలు పెట్టండి లేదంటే రిజెక్ట్ చేస్తాం.. సీఈసీ సూచన

అనుమానితుడు పోలాండ్ లోని ర్జెస్జో జిసియోంకా విమానాశ్రయంలోని భద్రతా వివరాలను సేకరించి రష్యాకు అందించినట్లు తెలుస్తోంది. జెలన్ స్కీ తన విదేశీ పర్యటనలకు తరుచుగా ఈ విమానాశ్రయం గుండా వెళ్తుంటారు. ఉక్రెయిన్ వెళ్లే విదేశీ అధికారులకు ఇక్కడి నుంచే వెళ్తుంటారు. ఈ కేసు ఉక్రెయిన్, ఉక్రెయిన్ ప్రజలకు మాత్రమే కాకుండా స్వేచ్చా ప్రపంచానికి రష్యా ఒక ముప్పుగా మారిందని ఉక్రెయిన్ చీఫ్ ప్రాసిక్యూటర్ ఆండ్రీ కోస్టిన్ అన్నారు. రష్యా నేర పాలన, ఇతర సార్వభౌమాధికార దేశాల్లో విధ్వంసక కార్యకలాపాలను నిర్వహిస్తోదని అన్నారు.

ఫిబ్రవరి 2022లో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పోలాండ్ ఉక్రెయిన్‌కి మద్దతుగా నిలుస్తోంది. మరోవైపు ఈ యుద్ధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్ స్కీ బలంగా రష్యాను వ్యతిరేకిస్తుండటంతో అతడిని అంతం చేయడానికి రష్యా పథకాలు రూపొందిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల వ్యవసాయ దిగుమతులపై వివాదంతో పోలాండ్, ఉక్రెయిన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ, యుద్ధంలో మాత్రం ఉక్రెయిన్‌కి బలమైన మద్దతుదారుగా పోలాండ్ ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Poland
  • Russia
  • Russia-Ukraine War
  • ukraine war
  • Zelensky

తాజావార్తలు

  • Ajit Doval Story: పాకిస్థాన్‌లో ఏడేళ్లు బిచ్చగాడిలా బతికిన అసలైన “ధురంధర్”.. దోవల్ మిషన్ సినిమాకంటే థ్రిల్లింగ్!

  • Varanasi Update: ఫాస్ట్ ట్రాక్‌లో ‘వారణాసి’ షూటింగ్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడో తెలుసా?

  • Box Office : ధురంధర్ – 2 దాటికి విలవిలలాడిన ఉస్తాద్ భగత్ సింగ్

  • Diamond Dacoit Challenge: హుక్ స్టెప్‌ వేయండి, లక్ష పట్టండి.. వినూత్నంగా మూవీ ప్రమోషన్స్!

  • Iran: ట్రంప్ వార్నింగ్‌కు స్ట్రాంగ్ ఇరాన్ కౌంటర్.. అమెరికాకు ఇదే చివరి హెచ్చరిక అంటూ..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions