Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Lucknow Software Engineer Died Saudi Arabia

Saudi: సౌదీలో భారతీయ మహిళ హత్య.. ఎవరు చంపారంటే..!

Published Date :January 13, 2026 , 6:58 pm
By Suresh Maddala
  • సౌదీ అరేబియాలో ఘోర విషాదం
  • భారతీయ మహిళ హత్య
  • భర్త, అత్తమామలపై బాధిత కుటుంబం ఫిర్యాదు
Saudi: సౌదీలో భారతీయ మహిళ హత్య.. ఎవరు చంపారంటే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

సౌదీ అరేబియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భారతీయ వివాహిత మహిళా అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. బాధితురాలు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోవాసిగా గుర్తించారు. వరకట్న వేధింపులతో భర్త చంపేశాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. కన్నీరు మున్నీరుగా విలపించారు.

ఇది కూడా చదవండి: Indo-China: డ్రాగన్ కవ్వింపులు.. వివాదాస్పద సరిహద్దుపై పాక్‌తో ఒప్పందం.. భారత్ మండిపాటు

లక్నోకు చెందిన ఐమాన్ ఖాన్. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. ముస్లిం ఆచారాల ప్రకారం ఏప్రిల్ 10, 2025న లక్నోలో మొహమ్మద్ అమీర్ ఖాన్‌తో వివాహం అయింది. పెళ్లైన దగ్గర నుంచి భర్త, అత్తమామల నుంచి వరకట్న వేధింపులు మొదలయ్యాయి. తొలుత ఇన్నోవా కారు కావాలని కోరితే.. వెంటనే కియా కారు కొనిచ్చారు. అయితే ఆ కారు అమీర్ పేరు మీద లేకపోవడంతో భార్య మొబైల్ ఫోన్‌ను పగలగొట్టాడు. అంతేకాకుండా వెంటనే సౌదీకి వెళ్లిపోయాడు. జూన్‌లో ఐమాన్ ఖాన్‌ను జెడ్డాకు పిలవడంతో అక్కడకు వెళ్లిపోయింది.

ఇది కూడా చదవండి: Maithili Thakur: ముంబైలో మైథిలి ఠాకూర్ ఎన్నికల ప్రచారం.. వెరైటీగా ఏం చేసిందంటే..!

తీరా వెళ్లాక భర్త, సోదరుడు, మరో ఇద్దరు బంధువులు రూ.20 లక్షలు తీసుకురావాలని వేధించడం ప్రారంభించారు. డబ్బు తీసుకురాకపోతే చంపేస్తామని బెదిరించారు. వేధింపులు తాళలేక అక్టోబర్ 2025న తిరిగి భారత్‌కు వచ్చేసింది. చేసేదేమీలేక అత్తమామలకు డబ్బు అందిస్తానని ఐమాన్ ఖాన్ తండ్రి హామీ ఇచ్చాడు. ఇక వేధించబోమని హామీ ఇవ్వడంతో తిరిగి అక్టోబర్ 19, 2025న ఐమాన్ ఖాన్ జెడ్డాకు వెళ్లింది. అయినా కూడా వేధింపులు ఆగలేదు. వెళ్లిన దగ్గర నుంచి ఆహారం పెట్టకుండా కడుపు మాడ్చడమే కాకుండా.. వేధింపులు ఎక్కవ కావడంతో తిరిగి భారత్‌కు వచ్చేస్తుండగా పాస్‌పోర్ట్ బలవంతంగా లాక్కుని ఇంటి నుంచి గెంటేశారు.

ఈ క్రమంలో డిసెంబర్ 17, 2025న వాట్సాప్ కాల్ సంభాషణ బట్టి బాధిత తండ్రికి అనుమానం వచ్చింది. ఏదో జరిగిందని అనుమానాలు రేకెత్తాయి. ఇక డిసెంబర్ 18 నుంచి ఎటువంటి ఫోన్ కాల్స్ రాకుండా బంద్ అయ్యాయి. దీంతో పొరుగువాడు సాయంతో.. పోలీసులు సమక్షంలో సోదాలు చేయగా ఐమాన్ ఖాన్ మృతదేహం లభ్యమైంది. దీంతో కుమార్తె మరణం తెలిసి కన్నీరు మున్నీరుగా విలపించారు.

సౌదీ నుంచి ఐమాన్ ఖాన్ మృతదేహాన్ని లక్నోకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా భర్త, అత్తమామలపై లక్నో పోలీసులకు బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. వరకట్న వేధింపులతో పాటు శారీరిక, మానసిక వేధింపులకు గురి చేశారని కంప్లంట్‌లో పేర్కొన్నారు. పోస్ట్ మార్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐమాన్ ఖాన్ ప్రస్తుతం గర్భవతి అని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లుగా చిన్‌హాట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ దినేష్ మిశ్రా తెలిపారు. ఈ కేసు విషయంలో విదేశాంగ శాఖ కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • india
  • Lucknow
  • saudi arabia
  • Software engineer died
  • suspicious

తాజావార్తలు

  • Off The Record : ఆత్మకూరులో మంత్రి అనుచరుల అడ్డగోలు దోపిడీ..?

  • Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..

  • Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

  • CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..

  • Off The Record : బుగ్గన అనుచరులు భూ కబ్జా చేశారా..?

ట్రెండింగ్‌

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions