ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్‌షహర్ జిల్లాలోని మహ్మద్‌పూర్ బర్వాలా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఒక చిన్నారితో సహా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. కుటుంబంలోని మిగిలిన ఇద్దరు సభ్యుల పరిస్థితి విషమంగా మారింది. అయితే.. అందరూ తోపుడు బండిపై విక్రయిస్తున్న కాల్చిన వేరుశనగ పప్పులు కొని తిన్నారని, ఆ తర్వాత వారి ఆరోగ్యం క్షీణించిందని చెబుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పాత ఊరిలో భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. భార్యపై అనుమానంతో తలపై డంపుల్స్ తో కొట్టి హతమార్చాడు. నిందితుడు తుపాకుల సాయిగా గుర్తించారు. కాగా.. మృతురాలు తుపాకుల అరుణకుమారి. అయితే.. వీరి స్వస్థలం బొబ్బిలి. పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం అనపర్తి వచ్చి బతుకుతున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లల సంతానం కూడా ఉంది. కాగా.. తన తల్లి మరణంతో పిల్లలు తీవ్రంగా రోధిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో గత కొన్ని రోజులుగా దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా 13 ఎయిర్‌పోర్టులకు తెలిసిందే. ప్రముఖ పాఠశాలలు, విమానాశ్రయాలు, కార్యాలయాలకు కూడా ఈ విధమైన హెచ్చరికలు వచ్చాయి.
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకొంది. అనుమానాస్పద స్థితిలో ఒక డాన్సర్ మృతిచెందడం స్థానికంగా సంచలనంగా మారింది. ఫలక్ నుమా పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముస్తఫా నగర్ లో నివాసముంటున్న షరీఫ్ ఫాతిమా(30) ఆర్కెస్ట్రా గ్రూప్ లో డాన్సర్ గా పనిచేస్తోంది. ఇటీవలే భర్త చనిపోవడంతో తన పిల్లల్తో కలిసి నివసిస్తోంది. ఇక ఇటీవలే ఆమె ఫలక్ నుమా పరిధిలో కొత్త ఇల్లు కొనుగోలు చేసింది. ఇల్లు షిఫ్టింగ్ పనులు చూసుకోవడానికి…