Nirav Modi: నీరవ్ మోడీ అప్పగింతకు లైన్‌క్లియర్.. భారత్‌కు అప్పగించేదెప్పుడంటే..!
- నీరవ్ మోడీ అప్పగింతకు లైన్‌క్లియర్
- నవంబర్ 23న భారత్‌కు అప్పగించనున్న యూకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను వేల కోట్లలో మోసం చేసి లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ అప్పగింతకు లైన్‌క్లియర్ అయినట్లు తెలుస్తోంది. భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమం అయినట్లు సమాచారం. ఇప్పటికే ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలును యూకే అధికారులు పరిశీలించి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో నవంబర్ 23న నీరవ్ మోడీని భారత్ అధికారులకు అప్పగించే అవకాశం ఉందని బ్రిటిష్ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: Israel-Hamas: గాజాపై ఆగని ఇజ్రాయెల్ దాడులు.. తాజా దాడుల్లో ఆరుగురు మృతి
Also Read
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ఇదిలా ఉంటే తన అప్పగింతను సవాల్ చేస్తూ నీరవ్ మోడీ మరోసారి కోర్టును ఆశ్రయించారు. భారత్‌కు అప్పగిస్తే విచారణ పేరుతో చిత్రహింసలు గురి చేస్తారని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే భారత దర్యాప్తు సంస్థలు హామీ పత్రాన్ని సమర్పించాయి. అలాంటి పనులకు పూనుకోబోమని హామీ పత్రాన్ని సమర్పించినట్లు సమాచారం. దీంతో నవంబర్ 23న తదుపరి విచారణ సమయంలో నీరవ్ మోడీని భారత్‌కు అప్పగించేందుకు న్యాయస్థానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: Italy: ఇటలీ విహారయాత్రలో విషాదం.. నాగ్‌పూర్‌కు చెందిన దంపతుల మృతి
2018లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసు బయటపడింది. ఈ కేసును ఈడీ, సీబీఐ దర్యాప్తు చేపట్టాయి. అప్పటికే నీరవ్ మోడీ దేశం దాటిపోయాడు. 2018 డిసెంబర్‌లో నీరవ్ మోడీ తమ దేశంలోనే ఉన్నాడని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. తమకు అప్పగించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. దీంతో 2019 మార్చిలో నీరవ్ మోడీని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 2021లోనే అప్పగించేందుకు ఏర్పాట్లు జరిగాయి. మొత్తానికి ఇన్నాళ్లకు నీరవ్ మోడీ అప్పగింతకు లైన్ క్లియర్ అయింది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!