Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- మహిళలు ఎల్పీజీ సిలిండర్లను ఎత్తలేరన్న కారణంతో ఉద్యోగం నిరాకరణ
- రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు
- ఇది స్త్రీత్వానికి అవమానమని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలు ఎల్పీజీ సిలిండర్లను ఎత్తలేరన్న కారణంతో ఉద్యోగం నిరాకరించినందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఇది మహిళలను అవమానించడమేనని పేర్కొంది. మహిళకు రూ.12 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
హర్యానాలోని గూఢా గ్రామానికి చెందిన సుమిత్రకు లింగ వివక్ష కారణంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్‌లో ఉద్యోగం నిరాకరించారు. ఎల్పిజి బాట్లింగ్ ప్లాంట్‌లో రీఫిల్లింగ్ హెల్పర్ లేదా క్యాజువల్ ఖలాసీ పదవికి డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలోని స్థానిక కమిటీ సిఫార్సు చేసిన 49 మందిలో సుమిత్ర కూడా ఒకరు. కేవలం మహిళ అయినందుకే ఆమెకు ఆ నియామకాన్ని నిరాకరించారు. దీంతో బాధిత మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే ఈ చర్యను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇది స్త్రీత్వానికి అవమానమని పేర్కొంది. ప్రస్తుతం ఆమె పదవీ విరమణ వయస్సు చేరుకోవడంతో ఉద్యోగానికి బదులుగా రూ.12 లక్షల పరిహారం చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది.
Also Read
- India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
జస్టిస్‌లు అరవింద్ కుమార్, విపుల్ ఎం. పంచోలిలతో కూడిన ధర్మాసనం కార్పొరేషన్‌ను తీవ్రంగా విమర్శించింది. అయితే ఉద్యోగంలో బరువైన ఎల్పీజీ సిలిండర్లను ఎత్తడం, రాత్రి షిఫ్టులు చేయడం వంటివి ఉంటాయని.. అందువల్ల అధికారులు మహిళలను తగినవారిగా పరిగణించకపోవచ్చని ఇండియన్ ఆయిల్ తరఫు న్యాయవాది వాదించారు. మహిళలు కూడా తమ ఇళ్లలో పగలు, రాత్రి గ్యాస్ సిలిండర్లను ఎత్తడం, మార్చడం చేస్తుంటారని కోర్టు వ్యాఖ్యానించింది.
- Tags
- LPG Job
- Supreme Court
- Woman
తాజావార్తలు
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!