Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- నోటీసులు అందుకున్న ఓటర్లకు కీలక వెసులుబాటు
- కుటుంబంలోని వయోజన సభ్యుడితో వివరాల సమర్పణ
- ఫారం-6 దరఖాస్తులకు కొత్త నిబంధనలు
- అక్టోబర్ 1, 2026 అర్హత తేదీగా పరిగణన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana SIR : రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ , క్లెయిమ్‌ల పరిశీలన ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఓటర్లకు జారీ చేసిన నోటీసుల పరిష్కారం , కొత్త ఓటరు నమోదుకు సంబంధించిన ఫారం-6 దరఖాస్తులపై అధికారులు పాటించాల్సిన స్పష్టమైన మార్గదర్శకాలను ఆయన వెల్లడించారు.
ఓటర్లకు ఉపశమనం.. స్వయంగా హాజరు కావాల్సిన అవసరం లేదు
ప్రత్యేక ప్రచార (SIR) ప్రక్రియలో భాగంగా వివిధ కారణాల వల్ల నోటీసులు అందుకున్న ఓటర్లు వ్యక్తిగతంగా అధికారుల ముందుకు హాజరు కావాల్సిన అవసరం లేదని సీఈఓ తెలిపారు. సదరు ఓటరు కుటుంబంలోని ఏదేని ఒక వయోజన కుటుంబ సభ్యుడు సంబంధిత ఈఆర్ఓ లేదా ఏఈఆర్ఓ ఎదుట హాజరై వివరాలు సమర్పించవచ్చని స్పష్టం చేశారు. ఓటరు తరఫున కుటుంబ సభ్యులు సమర్పించిన అవసరమైన పత్రాలు, సమాచారాన్ని స్వీకరించి, ఆ నోటీసులను త్వరితగతిన పరిష్కరించాలని సీఈఓ సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు స్పష్టమైన సూచనలతో ఉత్తర్వులు పంపడం జరిగింది.
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
ఫారం-6 దరఖాస్తుల పరిశీలన , డిక్లేరేషన్ ఫారం నిబంధనలు
నూతనంగా ఓటరు హక్కు కోసం దాఖలయ్యే ఫారం-6 దరఖాస్తుల పరిశీలన , క్లెయిమ్‌ల పరిష్కారంలోనూ నూతన నిబంధనలను పొందుపరిచారు. అర్హత కలిగిన ఓటరుగా గుర్తించడానికి 1 అక్టోబర్ 2026 ను ప్రధాన అర్హత తేదీగా పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న ఫారం-6 దరఖాస్తులతో పాటు భవిష్యత్తులో అందే దరఖాస్తులకు కూడా ఈ నిబంధనలే వర్తిస్తాయి. రాబోయే రోజుల్లో సమర్పించే ప్రతి ఫారం-6 దరఖాస్తుతో పాటు నిర్దేశిత డిక్లరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని సీఈఓ ఆదేశించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ అంతా భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన చట్టబద్ధమైన నిబంధనలకు కట్టుబడి పారదర్శకంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి