US elections: అమెరికాలో జాతీయభావాలు కలిగిన నేతగా, ముస్లిం వ్యతిరేకిగా లారా లూమర్‌కి పేరుంది. ప్రస్తుతం 31 ఏళ్ల లారా ట్రంప్ ప్రచారం బృందంతో పనిచేస్తుంది. ట్రంప్ పలు ప్రచార సమావేశాల్లో లారా దర్శనమిస్తోంది. ప్రస్తుతం ట్రంప్ ప్రచారం వర్గంలో లారా ఉండటం కూడా రిపబ్లికన్లలో కొంతమందికి నచ్చడం లేదు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఆమె ఉపాధ్యక్షురాలు, ప్రెసిడెంట్ రేసులో ఉన్న డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ గురించి జాత్యాహంకార వ్యాఖ్యలు చేసింది.
Read Also: Hamza Bin Laden: ఇంకా బతికే ఉన్న “ఒసామా బిన్ లాడెన్” కొడుకు.. వెస్ట్రన్ దేశాలపై దాడులకు ప్లాన్..
‘‘ కమలా హారిస్ గెలిస్తే, వైట్ హౌజ్‌లో కర్రీ వాసన వస్తుంది. వైట్ హౌజ్ ప్రసంగాలు కాల్ సెంటర్ ద్వారా సులభతరం చేయబడుతాయి. అమెరికన్ ప్రజలు ఎవరీకి అర్థం కానీ కాల్ ముగింపుతో వారి ఫీడ్‌బ్యాక్స్‌ని కస్టమర్ సాటిస్‌ఫాక్షన్ సర్వే ద్వారా తెలియజేయగలుగుతారు’’ అని ఎక్స్‌లో లారా లూమర్ వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తుంది. కమలా హారిస్ తన పూర్వీకులతో ఉన్న ఫోటోలు షేర్ చేసిన తర్వాత లారా ఈ వ్యాఖ్యలు చేసింది.
‘‘ తాను చిన్న వయసులో ఉన్నప్పుడు ఇండియాలోని అమ్మమ్మ తాతని కలిశాను. మా తాత నన్ను మార్నింగ్ వాక్ తీసుకెళ్లేవారు. సమానత్వం కోసం పోరాడటం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం యొక్క ప్రాధాన్యతను వివరించారు. రిటైర్డ్ సివిల్ సర్వెంట్ అయిన ఆయన భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కూడా భాగమయ్యారు’’ అని ఎక్స్‌లో రాశారు. కమలా హారిస్ భారతీయ అమెరికన్ రాజకీయవేత్త, ఆమె తల్లి భారతదేశానికి తండ్రి జమైకాకి చెందిన వారు. ప్రస్తుతం కమలా హారిస్‌ని ఉద్దేశించి లారా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.