అమెరికాలో ముస్లింలు రాజకీయ పదవులు చేపట్టడాన్ని నిషేధించాలని దూర హక్కుల కార్యకర్త లారా లూమర్ పిలుపునిచ్చారు. అందుకోసం చట్టం తీసుకురావాలని ఆమె డిమాండ్ చేసింది.
US elections: అమెరికాలో జాతీయభావాలు కలిగిన నేతగా, ముస్లిం వ్యతిరేకిగా లారా లూమర్‌కి పేరుంది. ప్రస్తుతం 31 ఏళ్ల లారా ట్రంప్ ప్రచారం బృందంతో పనిచేస్తుంది. ట్రంప్ పలు ప్రచార సమావేశాల్లో లారా దర్శనమిస్తోంది. ప్రస్తుతం ట్రంప్ ప్రచారం వర్గంలో లారా ఉండటం కూడా రిపబ్లికన్లలో కొంతమందికి నచ్చడం లేదు.
Laura Loomer: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. డెమొక్రాటిక్ పార్టీ తరుపున ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్స్ తరుపున డొనాల్డ్ ట్రంప్ మధ్య రసవత్తరమైన పోరు నడుస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా ఒక పేరు మాత్రం అమెరికాలో విస్తృతంగా వినిపిస్తోంది. ‘‘లారా లూమర్’’ అనే 31 ఏళ్ల యువతి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.