North Korea: కిమ్ తర్వాత ఉత్తర కొరియాను పాలించేది ఈమెనే..
- కిమ్ తర్వాత ఉత్తర కొరియాను పాలించేది జూ ఏ..
- తండ్రి తర్వాత బాధ్యతలు చేపట్టేందుకు శిక్షణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: ప్రపంచంలోనే అత్యంత నిగూఢ దేశంగా ఉత్తరకొరియాకు పేరుంది. అక్కడి ప్రజలకు బయట ఓ ప్రపంచం ఉందనే వాస్తవం చాలా వరకు తెలియదు. వారికి తమ పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ చెప్పిందే వేదం. అంతగా అక్కడ కిమ్ ప్రాపగండా నడుస్తుంది. ఇక అక్కడి నియమాలు, శిక్షలు ప్రపంచంలో మరే దేశంలో కూడా చూడలేము. ఆ దేశానికి తెలిసిందల్లా అమెరికా, వెస్ట్రన్ దేశాలపై వ్యతిరేకత, మిస్సైళ్ల తయారీ. ఇటీవల కాలంలో ఆ దేశం గూఢచార శాటిలైట్ల ప్రయోగాన్ని కూడా చేపట్టింది. మరోవైపు ఉత్తరకొరియాతో రష్యా సంబంధాలు కూడా ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల రష్యా అధినేత పుతిన్ ఆ దేశంలో పర్యటించారు.
Read Also: SP MP Ansari: ఎంపీ అన్సారీకి ఊరట.. 4 ఏళ్ల జైలు శిక్ష ఎత్తివేత
Also Read
ఇదిలా ఉంటే, ఉత్తర కొరియాకు భవిష్యత్ పాలకుడు ఎవరనే దానిపై అనుమానాలు వీడుతున్నాయి. కిమ్ తర్వాత భవిష్యత్ పాలకురాలిగా అతని కూతురు ‘జూ ఏ’ అధికారం చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఆ దేశాన్ని పాలించడానికి కావాల్సిన శిక్షణ పొందుతున్నట్లు దక్షిణ కొరియా స్పై ఏజెన్సీ చెప్పింది. కిమ్ ఊబకాయం, అనారోగ్యంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో తన కూతురిని పాలకురాలిగా చేసేందుకు ఆయన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
12-13 ఏళ్ల వయసున్న జూ ఏ ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో తన తండ్రి కిమ్‌లో కలిసి కనిపించింది. ముఖ్యంగా బాలిస్టిక్ మిస్సైళ్ల ప్రయోగ సమయంతో పాటు పలు అధికారిక కార్యక్రమాల్లో దర్శనిమిచ్చింది. అప్పటి నుంచి ఉత్తర కొరియాకు కాబోయే అధినేత ఈమనే అంటూ వార్తలు వస్తున్నాయి. ఉత్తర కొరియా మీడియా మార్చిలో జూ ఏని తండ్రి మార్గదర్శకత్వంలో గొప్ప వ్యక్తిగా కొనియాడింది. ఒక వేళ ఆ దేశ తదుపరి అధ్యక్షురాలిగా జూ ఏ ఎన్నికైతే, ఈ దేశాన్ని వరసగా పాలిస్తున్న కిమ్ వంశంలోని నాలుగో వ్యక్తి అవుతోంది. ఇప్పటికే కిమ్ తాతతో పాటు తండ్రి వరసగా అధికారాన్ని చేపట్టారు. కిమ్ ఇల్ సంగ్, కిమ్ జోంగ్ ఇల్ తర్వాత కిమ్ జోంగ్ ఉన్ ప్రస్తుతం అధికారంలో ఉన్నాడు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!