SriLanka Crisis: కిలో క్యారెట్ రూ.490, టొమాటో రూ.150..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో పరిస్థితిలు రోజురోజుకీ మరింత దిగజారిపోతున్నాయి.. నిత్యావసరాల నుంచి ఏ వస్తువుకు కూడా కొనలేని పరిస్థితి ఏర్పడుతోంది.. ఆ దేశ కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడంతో అక్రమంగా అన్నింటి ధరలు పైపైకి కదులుతున్నాయి.. ఇక, కూరగాయల ధరలు కూబా లంకలో భగ్గుమంటున్నాయి.. కిలో క్యారెట్ ధర ఏకంగా ఐదు వందలకు చేరువైంది.. బంగాళాదుంపలు రెండు వందలు దాటేశాయి.. గ్రామ్ వెల్లుల్లి రూ.150 దాటేసింది శ్రీలంక ఆర్థిక గందరగోళంలో కూరుకుపోవడంతో, రోజువారీ ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. కొలంబోలోని పేటలోని ఫెడరేషన్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ మార్కెట్ (FOSE మార్కెట్)లో కిలో టమోటాలు శ్రీలంక రూపాయల్లో 150కి చేరింది.. కిలో క్యారెట్ రూ.490గా ఉండగా.. కిలో ఉల్లిని 200కు విక్రయిస్తున్నారు.. కిలో బంగాళదుంపలు రూ.220కి ఎగిసింది.. గ్రామ్ వెల్లుల్లిని శ్రీలంకలో ఏకంగా రూ.160కి విక్రయిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు..
Read Also: Pawan Kalyan : జనసేన పోయిన చోటే వెతుక్కుంటుందా..? మరోసారి బరిలోకి దిగుతారా..? l
Also Read
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
శ్రీలంకలో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర రూ. 500ను దాటేసింది.. అది కూడా వారం రోజులు క్యూలో ఉంటే గాని పెట్రో దొరకని పరిస్థతి.. అప్పటి వరకు క్యూలో ఉన్నా.. దొరుకుతుందన్న గ్యారంటీ కూడా లేదు.. ఇక, బ్లాక్ లో రెండువేలు దాటేసింది లీటర్ పెట్రోలు ధర.. దీంతో, రవాణా ఛార్జీలు భారీగా పెరిగిపోయాయి.. ఇక, కూరగాయల ఉత్పత్తులను తీసుకురావడం మరియు వాటిని సురక్షితంగా ఉంచడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిందని కూరగాయల విక్రయదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. వీటి మూలంగా కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయని చెబుతున్నారు.. మొత్తంగా శ్రీలంకలో మునుపెన్నడూ లేని విధంగా కిరాణా ధరలు పెరగడమే కాదు, దేశంలో ఇంధన కొరత కూడా ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో 1990 అత్యవసర అంబులెన్స్ సేవ కూడా నిలిపివేయబడింది. 1990 అత్యవసర అంబులెన్స్ సర్వీస్ నంబర్‌కు కాల్ చేయవద్దని సువా సేరియా అంబులెన్స్ సర్వీస్ ప్రజలను కోరింది.
1948లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పుడే శ్రీలంక అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహారం, మందులు, వంటగ్యాస్ మరియు ఇంధనం వంటి నిత్యావసర వస్తువుల కొరత తీవ్రంగా ఉంది… ఇదిలా ఉంటే.. అన్ని పార్టీలు కలిసి మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరిన తర్వాత శ్రీలంక మంత్రివర్గం రాజీనామా చేయనుందని ప్రధాని రణిల్ విక్రమసింఘే కార్యాలయం తెలిపింది. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే బుధవారం తను రాజీనామా చేస్తానని ప్రధానికి తెలియజేశారు. కాగా, నిరసనకారులు రాజపక్సే అధికారిక నివాసంపై దాడి చేయడంతో ఆయన గుర్తు తెలియని ప్రదేశానికి పారిపోయిన విషయం తెలిసిందే.. ఆ తర్వాత ఆందోళనకారులు విక్రమసింఘే వ్యక్తిగత నివాసానికి నిప్పు పెట్టారు. రాజపక్సే తన నివాసం నుండి పారిపోయిన తర్వాత లక్షల రూపాయల నగదును వదిలేసి వెళ్లారని.. ఆ మొత్తాన్ని కోర్టుకు అందజేస్తామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!