భారతీయ-అమెరికన్ కాష్ పటేల్ భగవద్గీతపై ప్రమాణం చేసి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్‌గా అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. కాష్ పటేల్ ఎఫ్బీఐకి తొమ్మిదవ డైరెక్టర్. ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో పటేల్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఐసెన్‌హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ భవనంలో US అటార్నీ జనరల్ పామ్ బోండి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. క్రిస్టోఫర్ వ్రే తర్వాత తొమ్మిదవ FBI డైరెక్టర్‌గా కాష్ పటేల్‌ను US సెనేట్ ధృవీకరించిన విషయం తెలిసిందే.…