Health Tips: చాలామందికి అన్నమంటే చూసేందుకు తెల్లగా.. వేడివేడిగా ఉంటేనే తినాలనిపిస్తుంటుంది. అన్నం కాస్త చల్లబడినా ఇష్టపడని వారుంటారు. కొందరైతే చద్దన్నం అంటేనే వ్యాక్ చద్దన్నమా అంటుంటారు. కానీ దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే ఇక వద్దన్నా చద్దన్నమే ముద్దు అంటూ రోజూ ఆరగిస్తూనే ఉంటారు. ఇది మనోళ్లు చెప్పిన మాటలు కావు.. అమెరికన్ న్యూట్రిషియన్ అసోసియేషన్ అధ్యయనం చేసి వెల్లడించిన నిజాలు. ఇటీవల అమెరికన్ న్యూట్రిషియన్ అసోసియేషన్ చద్దన్నంపై అధ్యయనం చేసి కొన్ని విషయాలను వెల్లడించింది. ఆ అధ్యయనం ప్రకారం.. అన్నం పులిస్తే ఐరన్, పొటాషియమ్, కాల్షియం వంటి సూక్ష్మ పోషకాల స్థాయి పెరుగుతుందని తెలిపింది. ఉదాహరణకు రాత్రి వండిన అన్నంలో 100 గ్రాములకు 3.4 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటే.. తెల్లారేసరికి అది 73.91 మిల్లీ గ్రాములకు పెరుగుతుంది. బీ6, బీ12 విటమిన్లు కూడా ఎక్కువగా లభిస్తాయి.
Read Also: Guinness World Record: లిప్ కిస్ పెట్టుకున్నారు.. వరల్డ్ రికార్డ్ కొట్టారు
అందుకే చద్దన్నం తింటే శరీరం తేలికగా ఎనర్జిటక్‌గా ఉంటుంది. అంతేగాక చద్దన్నంతో శరీరానికి కావాల్సినంత బ్యాక్టీరియా లభిస్తుంది. వేడి చేయడం కారణంగా శరీరంలో కలిగే దుష్ఫలితాలను చద్దన్నం తగ్గిస్తుంది. తరచూ చద్దన్నం తినడంవల్ల పీచుదనం పెరిగి మల బద్దకం, నీరసం లాంటి సమస్యలు తగ్గిపోతాయి. అదేవిధంగా రక్తపోటు (బీపీ) అదుపులో ఉండి, ఆందోళన తగ్గుతుంది. శరీరం ఎక్కువసేపు ఉల్లాసంగా ఉండటానికి తోడ్పడుతుంది. అంతేగాక ఒంట్లోని అలర్జీ కారకాలు, మలినాలు తొలగిపోతాయి. పేగుల్లో అల్సర్ల వంటివి ఉంటే తగ్గిపోతాయి. ఎదిగే పిల్లలకు కూడా చద్దన్నం మంచి పౌష్టికాహారం. తరచూ చద్దన్నం తినడంవల్ల సన్నగా ఉన్నవాళ్లు లావయ్యేందుకు, లావుగా ఉన్నవాళ్లు సన్నబడేందుకు కూడా అవకాశం ఉంది. లావు తగ్గాలంటే రాత్రి మిగిలిన అన్నాన్ని రాత్రే చల్లలో నానబెట్టుకుని ఉదయాన్నే తినాలి. రోజూ ఇలా చేయడంవల్ల స్థూలకాయులు క్రమంగా లావు తగ్గుతారు. అదేవిధంగా రాత్రి మిగిలిన అన్నంలో పాలుపోసి చిటికెడు పెరుగుతో తోడేసుకుంటే తెల్లారేసరికే తోడన్నం తయారవుతుంది. నిత్యం ఈ తోడన్నం తినడంవల్ల సన్నగా ఉన్నవాళ్లు క్రమంగా లావు అవుతారు.