Modi-Putin: మోడీకి పుతిన్ ఫోన్ కాల్.. అలాస్కా వివరాలు వెల్లడి
- మోడీకి పుతిన్ ఫోన్ కాల్
- అలాస్కా వివరాలు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేశారు. సోమవారం నాడు ట్రంప్-జెలెన్‌స్కీ సమావేశానికి కొన్ని గంటల ముందు పుతిన్ ఫోన్ కాల్ చేశారు. ఈ సందర్భంగా ఆగస్టు 15న అలాస్కా వేదికగా ట్రంప్‌తో జరిగిన సంభాషణను మోడీతో పంచుకున్నారు.
ఇది కూడా చదవండి: INDIA Bloc: నేడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించనున్న కూటమి.. రేసులో శివ!
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ద్వైపాక్షిక సహకార అంశాలపై మోడీ, పుతిన్ చర్చించారని పీఎంవో తెలిపింది. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముగింపు పలకాలని.. శాంతియుతంగా సమస్య పరిష్కరించుకోవాలని మోడీ సూచించినట్లుగా పీఎంవో తెలిపింది. ఈ విషయంలో భారతదేశం పూర్తి మద్దతు ఇస్తుందని పుతిన్‌కు తెలియజేసినట్లుగా పేర్కొంది. ఇద్దరూ కూడా చాలా సన్నిహితంగా మాట్లాడుకున్నారని తెలిపింది.
ఇది కూడా చదవండి: Trump-Zelensky: వైట్‌హౌస్‌లో ట్రంప్-జెలెన్‌స్కీ నవ్వులు.. పువ్వులు.. వీడియో వైరల్
ఇక ఇదే విషయాన్ని ప్రధాని మోడీ కూడా ఎక్స్ వేదికగా తెలియజేశారు. ‘‘నా స్నేహితుడు అధ్యక్షుడు పుతిన్ ఫోన్ కాల్ చేసి అలాస్కాలో అధ్యక్షుడు ట్రంప్‌తో ఇటీవల జరిగిన సమావేశం గురించి పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం భారతదేశం నిరంతరం ప్రయత్నిస్తుంది. ఈ విషయంలో అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇస్తుంది.’’ అని పోస్ట్ చేశారు.
సోమవారం వైట్‌హౌస్ వేదికగా ట్రంప్-జెలెన్‌స్కీ, యూరోపియన్ దేశాధినేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు భద్రతా హామీ కల్పించాలంటూ ట్రంప్‌పై ఒత్తిడి తెచ్చారు. ఈ సమావేశం తర్వాత నేరుగా పుతిన్‌కు ట్రంప్ ఫోన్ చేశారు. దాదాపు ఇద్దరి మధ్య 40 నిమిషాల పాటు సంభాషణ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఫోన్ కాల్ తర్వాత ట్రంప్ కీలక ప్రకటన చేశారు. జెలెన్‌స్కీ-పుతిన్ భేటీ కాబోతున్నారని ప్రకటించారు. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొ్న్నారు. దీనికి పుతిన్-జెలెన్‌స్కీ ఇరుపక్షాలు కూడా అంగీకరించాయి. త్రైపాక్షిక సమావేశం ఏర్పాటుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇంకా స్థలం, తేదీ ప్రకటించలేదు. మొత్తానికి ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందానికి మార్గం సుగమం అవుతుంది.
Thank my friend, President Putin, for his phone call and for sharing insights on his recent meeting with President Trump in Alaska. India has consistently called for a peaceful resolution of the Ukraine conflict and supports all efforts in this regard. I look forward to our…
— Narendra Modi (@narendramodi) August 18, 2025
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!