Israel-Hamas: తక్షణమే బందీలను విడుదల చేయండి.. హమాస్‌కు ఇజ్రాయెల్ సూచన
- తక్షణమే బందీలను విడుదల చేయండి
- హమాస్‌కు ఇజ్రాయెల్ సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రంప్ ప్రణాళికను అంగీకరిస్తున్నట్లు హమాస్ ప్రకటించింది. బందీలందరినీ ఒకేసారి విడుదల చేస్తామని వెల్లడించింది. దీంతో గాజాలో శాంతికి పునాది పడినట్లైంది. అయితే తాజాగా హమాస్‌కు ఇజ్రాయెల్ కీలక సూచన చేసింది. తక్షణమే బందీలను విడుదల చేయాలని కోరింది. అలాగే పాలస్తీనా ఖైదీలను కూడా విడుదల చేస్తున్నట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్! అనుమానాలే నిజమయ్యాయి!
Also Read
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
ట్రంప్ ప్రణాళికలోని మొదటి దశను అమలు చేయడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని.. హమాస్ సానుకూల స్పందనను అనుసరించి సంఘర్షణ ముగించడానికి ముందుకు సాగుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ట్రంప్ ప్రణాళికను అనుసరించి తక్షణమే బందీలను హమాస్ విడుదల చేయాలని శనివారం నెతన్యాహు కార్యాలయం కోరింది. ట్రంప్, అతని బృందంతో పూర్తి సహకారంతో పని చేస్తామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Modi-Trump: ట్రంప్‌పై మోడీ ప్రశంసలు.. కారణమిదే!
ట్రంప్ ప్రణాళికను శుక్రవారం రాత్రి హమాస్ అంగీకరించింది. సజీవంగా లేదా మరణించిన బందీలందరినీ ఒకేసారి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హమాస్ ప్రకటించింది. అయితే హమాస్ శాంతి చర్చలకు అంగీకరిస్తే తక్షణమే దాడులు ఆపేయాలని ఇజ్రాయెల్‌కు ట్రంప్ సూచించారు. కానీ శనివారం తెల్లవారుజామున గాజాలో అనేక చోట్ల పేలుళ్లు సంభవించాయి. దీనిపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి.
శాంతి ప్రణాళిను హమాస్ అంగీకరించకపోవడంతో శుక్రవారం ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటల లోపు ప్రణాళికను అంగీకరించకపోతే నరకం చూస్తారని హమాస్‌ను ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. దీంతో హమాస్ దిగొచ్చింది. ట్రంప్ ప్రణాళికలోని కొన్ని అంశాలను అంగీకరిస్తున్నట్లు శుక్రవారం రాత్రి ప్రకటించింది. అంతేకాకుండా ఒకేసారి ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.
అక్టోబర్ 7, 2023న హమాస్ ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి 250 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లిపోయారు. అనంతరం ప్రతీకారంగా ఇజ్రాయెల్.. హమాస్‌పై దాడి చేసింది. నాటి నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. మధ్యలో అంతర్జాతీయ మధ్యవర్తుల కారణంగా కొంత మంది బందీలను హమాస్ విడుదల చేసింది. బదులుగా ఇజ్రాయెల్ జైల్లో ఉన్న ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఒకేసారి అందరినీ విడిచి పెట్టాలని ఇజ్రాయెల్ షరతు పెట్టింది. అందుకు హమాస్ ససేమిరా అంది. దీంతో యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక హమాస్ బందీల విడుదలకు అంగీకారం తెల్పడంతో పాలస్తీనా ఖైదీల విడుదలకు ఇజ్రాయెల్ రంగం సిద్ధం చేస్తోంది.
తాజావార్తలు
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!