ట్రంప్ ప్రణాళికను అంగీకరిస్తున్నట్లు హమాస్ ప్రకటించింది. బందీలందరినీ ఒకేసారి విడుదల చేస్తామని వెల్లడించింది. దీంతో గాజాలో శాంతికి పునాది పడినట్లైంది. అయితే తాజాగా హమాస్‌కు ఇజ్రాయెల్ కీలక సూచన చేసింది. తక్షణమే బందీలను విడుదల చేయాలని కోరింది. అలాగే పాలస్తీనా ఖైదీలను కూడా విడుదల చేస్తున్నట్లు తెలిపింది.