Israel: ఐరాస చీఫ్‌పై ఇజ్రాయెల్ ఆగ్రహం.. దేశంలోకి అడుగుపెట్టకుండా నిషేధం
- ఐరాస చీఫ్‌పై ఇజ్రాయెల్ ఆగ్రహం
- దేశంలోకి అడుగుపెట్టకుండా నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగిలిపోతుంది. బదులు తీర్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఐడీఎఫ్ ప్రణాళికలు రచిస్తోంది. ఇదిలా ఉంటే మంగళవారం ఇరాన్ క్షిపణి దాడులను చేసింది. అయితే ఈ దాడులను ఇప్పటి వరకు ఐక్య రాజ్య సమితి ఖండించలేదు. దీంతో ఇజ్రాయెల్ మరింత కోపంతో రగిలిపోయింది. ఈ పరిణామాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్రంగా పరిగణించింది. ఇరాన్ దాడిని ఖండించని వారెవరికైనా తమ దేశంలో అడుగుపెట్టే అర్హత లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్.. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Israel: ఇజ్రాయెల్ సైన్యంలో తొలి మరణం.. లెబనాన్‌లో ఒకరు చనిపోయినట్లు వెల్లడి
Also Read
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
ఇరాన్ చేసిన దాడిని ఐరాస్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఖండించలేదని ఇజ్రాయెల్ విదేశాంగశాఖ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ పేర్కొన్నారు. ఉగ్రవాదులు, రేపిస్టులు, హంతకులకు అండగా నిలుస్తున్నారని, ఐరాస చరిత్రపై ఆయనో మాయని మచ్చ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. గుటెరస్ ఉన్నా.. లేకపోయినా.. ఇజ్రాయెల్ తన పౌరులను రక్షించుకుంటుందని, దేశ గౌరవాన్ని నిలబెట్టుకుంటుందని వ్యాఖ్యానించారు. గుటెరస్‌ను ‘పర్సనా నాన్ గ్రాటా’గా ప్రకటించామని పేర్కొంటూ.. ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Indrakeeladri: దుర్గమ్మకు కుటుంబ సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించనున్న విజయవాడ సీపీ
ఇదిలా ఉంటే ఇరాన్ భారీ తప్పిదానికి పాల్పడిందని, తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వేళ భద్రతా కేబినెట్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఇరాన్ చర్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమపై చేసిన క్షిపణి దాడి విఫలమైందని.. ప్రపంచంలోనే అత్యంత అధునాతన డిఫెన్స్ వ్యవస్థతోనే ఇది సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా తమకు అండగా నిలిచిన అమెరికాకు నెతన్యాహు ధన్యవాదాలు తెలిపారు.
ఇది కూడా చదవండి: Nagarjuna: కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన నాగార్జున
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!