ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగిలిపోతుంది. బదులు తీర్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఐడీఎఫ్ ప్రణాళికలు రచిస్తోంది. ఇదిలా ఉంటే మంగళవారం ఇరాన్ క్షిపణి దాడులను చేసింది. అయితే ఈ దాడులను ఇప్పటి వరకు ఐక్య రాజ్య సమితి ఖండించలేదు. దీంతో ఇజ్రాయెల్ మరింత కోపంతో రగిలిపోయింది.