Terrorist Activities: జిహాద్, ఉగ్రవాద కార్యకలాపాలతో ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా పని చేస్తున్న హిజ్బ్–ఉత్–తహ్రీర్‌పై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Islamic State: ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మాజీ చీఫ్ ఖాసిం సులేమానీ స్మారకార్థం, ఆయన హత్యకు గురై నాలుగేళ్లు అవుతున్న సందర్భంగా.. ఇరాన్ లోని కెర్మాన్‌లో శ్రద్ధాంజలి ఘటించేందుకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సమయంలో జరిగిన రెండు భారీ బాంబు పేలుళ్లలో 103 మంది మరణించారు. అయితే ఈ దాడి తమ పనే అని ‘ఇస్లామిక్ స్టేట్’ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించింది. టెలిగ్రామ్ ఛానెల్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది.
Afghanistan: తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి ఉగ్రదాడి జరిగింది. పశ్చిమ ఆఫ్ఘాన్‌లోని హెరాత్ నగరంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. షియా మతగురువులే టార్గెట్‌గా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. నగరంలోని కోరా మిల్లీ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఏడుగురు మరణించగా.. ఒకరు గాయపడ్డారు.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి బాంబు దాడితో దద్దరిల్లింది. ఈ వారం ప్రారంభంలో హత్యకు గురైన ఆఫ్ఘన్ మంత్రి అంత్యక్రియల్లో ఆత్మాహుతి దాడి జరిగింది. బదక్షన్ ప్రావిన్స్ రాజధాని ఫైజాబాద్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. ఈ బాంబుదాడిలో 11 మంది మరణించగా.. 30 మంది గాయపడినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది. ఆఫ్ఘన్ ప్రభుత్వం ఈ దాడిని ఖండించింది.
సిరియాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థ సిరియాలోని హమా ప్రాంతంలో పుట్టగొడుగులను తీయడానికి వెళ్లిన 31 మందిని చంపింది. బ్రిటన్‌లోని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ కూడా నలుగురు గొర్రెల కాపరులను చంపి, ఇద్దరు జిహాదీలను కిడ్నాప్ చేసింది.
Congo : ఆఫ్రికా దేశమైన కాంగోలో ఉగ్రవాదులు మరోసారి నరమేథానికి పాల్పడ్డారు. పశ్చిమ కాంగోలోని బెనీ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో దాదాపు 20 మందికి పైగా సాధారణ ప్రజలు చనిపోయారని సమాచారం.
గతేడాది కేంద్రంచే నిషేధించబడిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI) 2047 నాటికి భారత్‌లో ఇస్లాం పాలనను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుందని మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ క్లెయిమ్ చేసింది.
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని షియా నివాస ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఘోర పేలుడుకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ పేలుడులో కనీసం ఎనిమిది మంది మరణించారని, 18 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
దేశంలో ఉగ్ర కదలికలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రత్యేక నిఘా పెట్టింది. ఆదివారం 8 రాష్టాల్లో భారత్‌లో ఐసిస్ ఉగ్రసంస్థ కార్యకలాపాలపై నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా దాడులు చేసింది. 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు తప్పుకున్నాక ఆ దేశంలో అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థలు మళ్లీ తన ఉనికిని చాటుకోవడం మొదలుపెట్టాయి. ఇప్పటికే ఆఫ్ఘన్‌లో షియా ముస్లీంలను లక్ష్యంగా చేసుకొని ఐసిస్ దాడులు చేస్తున్నది. ఇటీవలే రెండు నగరాల్లో ఉగ్రవాదులు దాడులు చేసి వందల సంఖ్యలో మరణాలకు కారణమయ్యాయి. తాలిబన్ ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు గుర్తించక పోవడంతో ఆ దేశంలో ఉగ్రసంస్థల బలం పెరిగే అవకాశం ఉందని, ఇది ఆఫ్ఘన్ దేశానికి మాత్రమే కాకుండా…