Khalistan: ఖలిస్తాన్ ఉగ్రవాదులకు పాక్ ఐఎస్ఐ సహకారం.. పోర్చుగల్‌లో కొత్త స్థావరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalistan: ఖలిస్తాన్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. కెనడా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తరుచుగా ఆందోళన పేరుతో విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ గూఢాచార సంస్థఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) ఇటీవల పంజాబ్‌లోని క్రియాశీల నేరస్థులకు, ఖలిస్తానీ ఉగ్రవాదులకు సాయం చేస్తోంది. పోర్చుగల్ నుంచి అక్రమ ఆయుధాలను పంపినట్లు సమాచారం. ఇప్పటికే వివిధ దేశాల్లో ఖలిస్తానీ ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు స్థావరాలు ఉండగా.. కొత్తగా పోర్చుగల్ లో స్థావరాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
Read Also: Resomation: నీటిలో అంత్యక్రియలు.. పలు దేశాల్లో వినియోగం.. ఇప్పుడు బ్రిటన్‌లో అందుబాటులోకి
Also Read
పోర్చుగల్ లో నివసిస్తున్న ఉగ్రవాదులకు ఆయుధాలు, నిధులు అందించడంలో ఐఎస్ఐ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఆయుధాలు, నిధులను పంజాబ్, దేశంలోని ఇతర ప్రాంతాల్లో నేర కార్యకలాపాలు నిర్వహించడానికి ఉపయోగిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌కు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాదిని కొద్ది రోజుల క్రితం పోర్చుగల్‌లో పట్టుకోవడంతో ఈ నెట్వర్క్ మొత్తం బయటకు వచ్చింది. టూరిస్ట్ వీసాపై దేశంలో ఉంటున్న వ్యక్తి వద్ద నుంచి AK-47, MP-5 సబ్‌మెషిన్ గన్, హ్యాండ్ గ్రెనేడ్లు, పిస్టల్స్ లభించాయి. పంజాబ్‌లోని చురుకైన నేరస్థులకు ఈ ఆయుధాలను అందజేసే బాధ్యతను ఐఎస్ఐ అతనికి అప్పగించిందని అతను తెలిపాడు.
ఇదిలా ఉంటే కెనడాలో జూలై 8న ఖలిస్తాన్ అనుకూల ఆందోళనలు జరగనున్నాయి. దీనిపై భారత్ కెనడా రాయబారి కామెరూన్ మాకేకి సమన్లు జారీ చేసింది. కెనడాలోని అట్టావా, టొరంటో, వాంకోవర్ లోని భారతీయ రాయబార కార్యాలయాల ముందు నిరసన తెలిపేందుకు ప్లాన్ చేశాయి. అంతకుముందు కొందరు భారతీయ రాయబార్ల పేర్లను ప్రస్తావిస్తూ ఖలిస్తానీ ఉగ్రవాదులు పోస్టర్లు రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం పాకిస్తాన్, కెనడా, బ్రిటన్ లో ఉన్న ఖలిస్తానీ టెర్రరిస్టులను ఏకీకృతం చేయడంతో పాటు పలువురు క్రిమినల్స్ ని రిక్రూట్ చేసే పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Raaka: ‘బన్నీని ఇలా ఎప్పుడూ చూడలేదు’.. ‘రాకా’ సెట్ చూసి షాకైన మంచు లక్ష్మి
-
Regina Cassandra : హీరోయిన్ నుండి విలన్ పాత్రలకు షిఫ్ట్ అయిన రెజీనా కాసాండ్రా
-
OPPO Find X9s: సగం ధరకే ఒప్పో Find X9s.. 12GB RAM, 50MP కెమెరా, 7025mAh బ్యాటరీతో ప్రీమియం 5G ఫోన్
-
Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
-
Karthi30: ‘మార్షల్’ కంటే ముందే ‘కార్తి30’ పూర్తి?.. షూటింగ్ షెడ్యూల్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!