Tibet Earthquake: 7 తీవ్రతతో టిబెట్‌లో భూకంపం.. 16 మంది మృతి, 32 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tibet Earthquake: టిబెట్‌లో భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఈ ప్రకృతి విపత్తులో కనీసం 16 మంది మృతి చెందగా, మరో 32 మంది గాయపడ్డారు. వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) వివరాల ప్రకారం, భారత కాలమానం ప్రకారం రాత్రి సుమారు 8:03 గంటలకు భూకంపం సంభవించింది. టిబెట్ రాజధాని లాసా నగరానికి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర టిబెట్‌లోని నాగ్కూ నగర పరిధిలో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం. భూమికి సుమారు 173 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read
- Nvidia Scandal: జెన్సన్ హువాంగ్-ఆలిస్లను కలిపింది ఆమె భర్తే.. ఎన్విడియా కేసులో ట్విస్ట్..
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ అరాచకం.. హసీనా రాకముందే బాంబు దాడులు, ఆందోళనలు!
- North Korea: అమెరికా దెబ్బకు వణికిపోతున్న కిమ్.. 54 ఏళ్ల తర్వాత రాజ్యాంగం మార్చి సంచలన నిర్ణయం!
- Donald Trump: ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. 93 శాతం కాదు, 100 శాతం విజయం సాధిస్తాం!
భూకంప ప్రకంపనలు ఒక్కసారిగా రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లు, వాహనాలు బలంగా కంపించడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు ఇళ్లు, హోటళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దుకాణాల్లోని వస్తువులు ర్యాక్‌ల నుంచి కిందపడిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఉత్తర టిబెట్‌లోని నాగ్కూ నగరంలో వందలాది ఇళ్లు కూలిపోయినట్లు సమాచారం. నగర ప్రభుత్వ అధికారులను ఉటంకిస్తూ నాగ్కూ మీడియా కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం, భూకంపం కారణంగా కనీసం 339 ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి.
భూకంపం ధాటికి కూలిపోయిన భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిరాశ్రయులైన ప్రజలకు తాత్కాలిక వసతి కల్పించేందుకు టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. సహాయక చర్యలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గత ఐదేళ్లలో టిబెట్ ప్రాంతంలో సంభవించిన అతిపెద్ద భూకంపంగా ఈ ఘటనను పేర్కొంటున్నారు. భారీ ప్రకంపనల కారణంగా భవనాలు దెబ్బతినడం, ప్రజలు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సహాయక చర్యలు పూర్తయ్యే వరకు మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత మారే అవకాశం ఉంది.
టిబెట్‌లో ఈ భూకంపం సంభవించడానికి కొన్ని వారాల ముందు నేపాల్, చైనా ఆధీనంలోని టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంత సరిహద్దుల సమీపంలో వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. వరుస ప్రకృతి విపత్తులు హిమాలయ ప్రాంత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. టిబెట్ భూకంప ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒకటి. భారతీయ టెక్టానిక్ ప్లేట్ ఉత్తర దిశగా కదులుతూ యురేషియన్ ప్లేట్‌ను ఢీకొంటోంది. ఈ రెండు భూఫలకాల కదలికల కారణంగానే హిమాలయ పర్వత శ్రేణులు ఏర్పడ్డాయి. ఇదే భౌగోళిక ప్రక్రియ వల్ల భూమి అంతర్భాగంలో ఒత్తిడి పెరిగి, తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి.
తాజావార్తలు
-
UP Elections: హిందూ ఓటర్లపై ఎస్పీ గురి.. ఎట్టకేలకు అయోధ్యకు అఖిలేష్.!
-
Tabitha Sukumar: గొడవ మధ్యలోనే సుకుమార్ అలా చేస్తారట.. తబిత సుకుమార్ చెప్పిన ముచ్చట వింటే నవ్వాగదు!
-
New Pensions: కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం.. నవంబర్ 19న అకౌంట్లోకి డబ్బులు జమ..
-
IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ.. హైదరాబాద్ కమిషనర్‌గా కొత్త బాస్..
-
TG SAFE: పెద్ద బ్రాండ్లే కదా అని సేఫ్ అనుకుంటున్నారా? డొమినోస్, కేఎఫ్‌సీ స్టోర్లలో తనిఖీలతో కలకలం!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!