ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలకు దిగబోతుందున్న వార్తల నేపథ్యంలో ట్రంప్ హత్యా బెదిరింపులను ఇరాన్ టీవీ ప్రసారం చేసింది. ‘‘అప్పుడు బుల్లెట్ మిస్ అయింది.. ఈసారి గురి తప్పదు’’ అంటూ ఇరాన్ టీవీ బహిరంగంగా ప్రసారం చేసింది. అంటే అమెరికా దాడికి దిగితే.. ప్రతి దాడి ఉంటుందని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది.