Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Iranian Fighter Jet Crashes Pilot Dies

Iran: ఉద్రిక్తతల వేళ ఇరాన్‌లో కూలిన ఫైటర్ జెట్.. పైలట్ మృతి

Published Date :February 20, 2026 , 10:31 am
By Suresh Maddala
  • ఉద్రిక్తతల వేళ ఇరాన్‌లో కూలిన ఫైటర్ జెట్
  • పైలట్ మృతి.. గాయాలతో బయటపడ్డ మరో ఫైలట్
  • 10 రోజుల్లో ఏదైనా జరగవచ్చన్న ట్రంప్
Iran: ఉద్రిక్తతల వేళ ఇరాన్‌లో కూలిన ఫైటర్ జెట్.. పైలట్ మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌కు చెందిన ఫైటర్ జెట్ కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. పశ్చిమ హమేదాన్ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగిందని.. ఫైటర్‌ జెట్‌లో ఇద్దరు పైలట్లు ఉండగా ఒక పైలట్ మరణించారని రాష్ట్ర ప్రసార సంస్థ వెల్లడించింది. అర్థరాత్రి శిక్షణా సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా పేర్కొంది. అయితే ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని ఇరిబ్ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ఇది కూడా చదవండి: Trump: బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్‌లో పాక్ ప్రధానికి అవమానం.. ట్రంప్ ఏం చేశారంటే..!

Also Read

  • Brazilian Athlete: స్విమ్ రేస్ లో ప్రముఖ బ్రెజిలియన్ అథ్లెట్ మృతి..
  • Hormuz Attack: హోర్ముజ్ జలసంధిలో మళ్లీ టెన్షన్.. మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ కాల్పులు.. తృటిలో తప్పిన ప్రమాదం!
  • Sudan Gurung: కొత్త ప్రభుత్వంలో అప్పుడే రాజీనామా! ఆరోపణలు వచ్చిన మూడు రోజుల్లోనే వైదొలిగిన హోం మంత్రి..
  • Operation Sindoor: భారత్ దెబ్బకు వణికిపోయిన ఉగ్రవాదులు.. ఇప్పటికీ అజ్ఞాతంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌లు మసూద్ అజార్, హఫీజ్ సయీద్!

గత కొద్దిరోజులుగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికాతో అణు ఒప్పందానికి ఇరాన్ నిరాకరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఈ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ కూడా తన సైన్యాన్ని సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ఫైటర్ జెట్ కూలిపోయినట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే గురువారం వాషింగ్టన్‌లో జరిగిన బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్‌లో ట్రంప్ మాట్లాడుతూ మరోసారి ఇరాన్‌కు తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. రాబోయే 10 రోజుల్లో ఇరాన్‌పై పెద్ద విషయం జరగవచ్చని.. ఆలోపు ఇరాన్ తప్పనిసరిగా రాజీపడాలని ట్రంప్ హెచ్చరించారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సూచించారు.

ఇది కూడా చదవండి: Trump-Obama: ఒబామా చాలా తప్పు చేశారు.. ఆ వార్త లీక్ చేయడంపై ట్రంప్ అభ్యంతరం

ఇదిలా ఉంటే అమెరికాతో ఢీ అంటే ఢీ అనడానికి ఇరాన్ రెడీ అవుతోంది. అమెరికా యుద్ధ నౌకలను సముద్రంలోనే ముంచేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హెచ్చరించారు. దీనిని బట్టి ఇరాన్ కూడా యుద్ధానికి దిగేందుకు సిద్ధపడుతున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఇక ఒమన్, జెనీవాలో జరిగిన అణు ఒప్పంద చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి.

ఇది కూడా చదవండి: US-UK: ఇరాన్‌పై దాడికి ప్రణాళిక.. బ్రిటన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలు.. కారణమిదే!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • america
  • Ayatollah Ali Khamenei
  • Donald Trump
  • Iran military tension
  • Iranian fighter jet crashes

తాజావార్తలు

  • TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన

  • Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్‌గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్

  • CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..

  • Katte Pongali Recipe : టెంపుల్ స్టైల్ కట్టె పొంగలి రహస్యం ఇదే.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు.!

  • Google: గూగుల్ గురించి మీకు తెలియని క్రేజీ ఫ్యాక్ట్స్ ఇవే!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions