Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
- ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి
- అమెరికాకు ఇరాన్ వార్నింగ్
- కొద్దిసేపటి క్రితమే ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా మరోసారి ఉద్రిక్తతలతో అట్టుడుకుతోంది. గతేడాది జూన్ 12న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడి చేసి అణు స్థావరాలను ధ్వంసం చేశాయి. తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరి 28న సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేసి ఖమేనీ సహా కీలక నేతలందరినీ హతం చేశాయి. అనంతరం ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. అయితే ఏప్రిల్ 8 నుంచి కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా తిరిగి మళ్లీ టెన్షన్ మొదలైంది. ఇరాన్-అమెరికా పరస్పరం కవ్వించుకుంటున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ రాత్రికి భీకర దాడులుంటాయని వార్నింగ్ ఇచ్చారు.
ఇప్పుడు ట్రంప్‌నకు కౌంటర్‌గా ఇరాన్ కూడా వార్నింగ్ ఇచ్చింది. అమెరికా తీసుకునే ఏ కొత్త చర్యకైనా మరింత బలమైన, బాధాకరమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది. టెహ్రాన్‌పై అమెరికా మరిన్ని సైనిక చర్యలు చేపడితే.. బాధాకరమైన ప్రతిస్పందనను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్‌కు చెందిన ఒక సీనియర్ చట్టసభ సభ్యుడు హెచ్చరించారు. వాషింగ్టన్ నుంచి ఎలాంటి కొత్త దురాక్రమణ జరిగినా దానికి గట్టిగా ప్రతీకారం తీర్చుకోవడానికి టెహ్రాన్ సిద్ధంగా ఉందని ఇరాన్ పార్లమెంటరీ జాతీయ భద్రతా కమిటీ అధిపతి హెచ్చరించారు. ఒత్తిడికి లొంగబోమనే టెహ్రాన్ వైఖరిని నొక్కిచెప్పారు. కొనసాగుతున్న సంఘర్షణలో ట్రంప్ చివరికి లొంగిపోవాల్సి వస్తుందన్నారు. ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిషన్ ప్రతినిధి ఇబ్రహీం రెజాయీ మాట్లాడుతూ… లొంగిపోవాల్సింది ఇరాన్ కాదు.. అమెరికాయే అని అన్నారు. ఈ పోరాటంలో నిస్సందేహంగా అమెరికాయే లొంగిపోవాలన్నారు.
Also Read
- Tags
- america
- Iran
- Middle East
- trump
- us
తాజావార్తలు
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!