Iran-US: శాంతి చర్చలపై ఇరాన్ సంచలన నిర్ణయం.. మరింత టెన్షన్‌గా పశ్చిమాసియా
- పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తం
- లెబనాన్‌పై దాడి నేపథ్యంలో మారిన ఇరాన్ వైఖరి
- అమెరికాతో చర్చలు నిలిపివేసినట్లు సమాచారం
- హార్ముజ్ దిగ్బంధంపై తీవ్ర వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారేటట్టు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ.. ఉద్రిక్తతలు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. మధ్యవర్తుల ద్వారా శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ కొలిక్కి రావడం లేదు. దీంతో అవే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇక లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది.
అమెరికాతో ఇరాన్ చర్చలు నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా హార్ముజ్ దిగ్బంధం మరింత కఠినం చేయబోతున్నట్లుగా ఇరాన్‌కు చెందిన వార్తా సంస్థలు వెల్లడించాయి. ఇరాన్ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. లెబనాన్ కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన కీలక అంశాల్లో భాగమని.. ప్రస్తుతం ఇజ్రాయెల్ చర్యలతో ఆ ఒప్పందం పూర్తిగా ఉల్లంఘించబడిందని టెహ్రాన్ ఆరోపిస్తోంది. ఈ పరిస్థితుల్లో మధ్యవర్తుల ద్వారా అమెరికాతో జరుగుతున్న చర్చలు, పత్రాల మార్పిడిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇరాన్ చర్చల బృందం తెలిపినట్లు వార్తలు వచ్చాయి.
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
ఇరాన్ అధికారులు, చర్చల ప్రతినిధులు స్పష్టం చేసినట్లుగా.. ఇజ్రాయెల్ సైన్యం.. గాజా, లెబనాన్ ప్రాంతాల్లో కొనసాగిస్తున్న దాడులను వెంటనే నిలిపివేయాలని.. అలాగే లెబనాన్‌లో ఆక్రమిత ప్రాంతాల నుంచి పూర్తిగా వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు నెరవేరే వరకు అమెరికాతో ఎలాంటి చర్చలు ఉండవని ఇరాన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో హార్ముజ్ జలసంధిపై కూడా ఇరాన్ కఠిన వైఖరి అవలంబించినట్లు సమాచారం. ప్రపంచ ఇంధన సరఫరాలో కీలకమైన హార్ముజ్‌ను పూర్తిగా దిగ్బంధించాలని టెహ్రాన్ నిర్ణయించినట్లు వార్తలు వెలువడ్డాయి. అంతేకాకుండా బాబ్ అల్-మండబ్ జలసంధి సహా ఇతర కీలక సముద్ర మార్గాల్లో కూడా ఒత్తిడి పెంచే చర్యలు చేపట్టే అవకాశముందని పేర్కొన్నాయి.
హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ రవాణాలో గణనీయమైన భాగం జరుగుతుండటంతో ఇరాన్ తాజా నిర్ణయం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా-ఇరాన్ సంబంధాలు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో పరిస్థితులను మరింత సంక్లిష్టం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!