Iran War: కోవిడ్ తర్వాత అతిపెద్ద ‘‘లాక్‌డౌన్’’కు ప్రపంచం సిద్ధమవుతోందా..?
- ప్రపంచం మరో కోవిడ్ తరహా ‘‘లాక్‌డౌన్’’కు సిద్ధమవుతోందా..?
- ఇరాన్ యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ‘‘ఇంధన సంక్షోభం’’ ఏర్పడుతోంది. ముఖ్యంగా, ఇజ్రాయిల్ అమెరికా దాడుల కారణంగా ఇరాన్ ఇంధన రవాణాకు చాలా కీలకమైన ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసేసింది. దీంతో ఇప్పుడు బ్యారెల్ క్రూడాయిల్ ధర 112 డాలర్లకు చేరుకుంది. అమెరికాలో గ్యాస్ ధర గ్యాలన్‌కు 5 డాలర్లు దాటాయి. దీంతో ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు తీవ్రంగా పెరుగుతున్నాయి.
ఇదే కాకుండా, ఇంధన సంక్షోభం కారణంగా విమాన సర్వీసులు కూడా తగ్గుతున్నాయి. దీంతో ప్రమాణ ఖర్చులు మరింత పెరుగుతున్నాయి. పలు దేశాల ప్రభుత్వాలు అనవసరమైన ఖర్చుల్ని తగ్గించాలని కోరుతున్నాయి. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఈ వారంలోనే తన విమాన సర్వీసులలో 5% తగ్గించింది. ఇతర దేశాల్లోని విమానయాన సంస్థలు కూడా తమ సర్వీసులను తగ్గిస్తున్నాయి. అవనసరమైన ప్రయాణాలు తగ్గించుకోవాలని ప్రభుత్వాలు కోరడం చూస్తే గతంలో కోవిడ్ ‘‘లాక్‌డౌన్’’ గుర్తుకు వస్తోంది.
Also Read
- Trump: నోబెల్ గౌరవాన్ని తగ్గించారు.. నవీ పిళ్లైకు శాంతి బహుమతి ఇవ్వడంపై ట్రంప్ ఆక్షేపణ
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
- Explainer: అక్కడికి పోతే... అటు నుంచి అటే పోతారు..!
Read Also: Dimona: ఇజ్రాయిల్ ‘‘లిటిల్ ఇండియా’’పై ఇరాన్ దాడి..
ఇక చాలా దేశాలు ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌ను రేషన్ పద్ధతిలో ఇస్తున్నాయి. పాకిస్తాన్ వంటి దేశాలు ఇంధన సంక్షోభంతో గణతంత్ర వేడుకల్ని కూడా క్యాన్సల్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. జపాన్‌లో చమురు రేషన్ అమలులోకి వచ్చింది. దక్షిణ కొరియా కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తోంది. బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, శ్రీలంకల్లో పెట్రోల్ కోసం పొడవైన క్యూలు దర్శనమిస్తున్నాయి. అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోవాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం తన ప్రజల్ని కోరుతోంది. భారతదేశానికి అవసరమయ్యే ముడి చమురులో 80 శాతం దిగుమతి అవుతోంది. గల్ఫ్ దేశాల నుంచి చమురు, ముఖ్యంగా ఖతార్ నుంచి ఎల్పీజీని భారత్ దిగుమతి చేసుకుంటోంది. దీంతో భారత చమురు అవసరాలు కూడా ఇప్పుడు ఒత్తిడికి గురవుతున్నాయి.
అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ‘ఆయిల్ షాక్‌ల నుండి రక్షణ’ అనే పేరుతో 10 సూత్రాల ప్రణాళికను విడుదల చేసింది. ఇది ప్రభుత్వాలకు సూచనలు చేసింది. వాహన వినియోగంపై నియంత్రణ, హైవేల్లో స్పీడ్ లిమిట్ తగ్గింపు, వర్క్ ఫ్రం హోమ్, గ్యాస్ బదులుగా ఎలక్ట్రిక్ వినియోగం వంటి సూచనలు చేసింది.
Global oil markets are facing a historic supply disruption amid the war in the Middle East, pushing up prices for consumers.
Our new report sets out 10 immediate demand-side options to help governments, businesses & households ease the economic impacts → https://t.co/1XZIgeA2BG pic.twitter.com/vwcrjRUmvK
— International Energy Agency (@IEA) March 20, 2026
తాజావార్తలు
-
Trump: నోబెల్ గౌరవాన్ని తగ్గించారు.. నవీ పిళ్లైకు శాంతి బహుమతి ఇవ్వడంపై ట్రంప్ ఆక్షేపణ
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు