Dimona: ఇజ్రాయిల్ ‘‘లిటిల్ ఇండియా’’పై ఇరాన్ దాడి..
- ఇజ్రాయిల్ ‘‘లిటిల్ ఇండియా’’పై ఇరాన్ దాడి..
- అణు నగరంగా ‘‘డిమోనా’’కు పేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dimona: ఇరాన్ యుద్ధం ప్రారంభమై 3 వారాలకు చేరింది. అయినప్పటికీ యుద్ధ తీవ్రత తగ్గడం లేదు. ఇప్పటికీ అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్‌పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. మరోవైపు, దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయిల్‌పై దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ ‘అణు నగరం’’గా చెప్పబడుతున్న డియోనాపై దాడి చేసింది. డిమోనాను ఇజ్రాయిల్‌లోనే ‘‘లిటిల్ ఇండియా’’గా చెబుతారు. డిమోనాలో జిలేబీలు, చాట్ సువాసనలు గుబాళిస్తుంటాయి. భారత్ లాగే రంగు రంగుల బట్టలు కనిపిస్తుంటాయి.
ఇరాన్‌లోని నతాంజ్ అణు సంపన్న కేంద్రంపై జరిగిన దాడికి ప్రతీకారంగా డియోమాన నగరంపై శనివారం ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 33 మంది గాయపడ్డారు. ఇజ్రాయిల్‌కు చెందిన కీలక అణు కేంద్రంగా ఉన్న డిమోనా “లిటిల్ ఇండియా” అనే బిరుదును కూడా సంపాదించుకుంది. ఇక్కడి 7,500 మంది భారతీయ-యూదు కమ్యూనిటి పట్టణ జనాభాలో సుమారు 30 శాతంగా ఉంది. నగరంలో మరాఠీ, కొద్దిగా హిందీ వినిపిస్తాయి, క్రికెట్‌కు ఫ్యాన్ ఉంటారు. దుకాణాలలో సోన్‌పాప్డీ, గులాబ్ జామున్, పాప్రి చాట్, భేల్‌పురి వంటి భారతీయ వంటకాలు కనిపిస్తుంటాయి.
Also Read
- Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
- Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్‌లో హై-వోల్టేజ్ డ్రామా..
- Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
- Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
భారత్ నుంచి ఇజ్రాయిల్‌కు 1950, 1960లలో వలసలు కొనసాగాయి. వీరిలో ఎక్కువగా మహారాష్ట్రకు చెందిన బెనే ఇజ్రాయిలీలు, కేరళకు చెంది కొచిన్ యుదూలు, కోల్‌కతాల నుంచి బాగ్దాదీ యూదులు వలస వెళ్లారు. మిజోరం, మణిపూర్ నుంచి బెనై మోనాషే వంటి వారు ఇజ్రాయిల్‌కు వెళ్లి స్థిరపడ్డారు. ఇలా వెళ్లిన వారిలో ఎక్కువ మంది వజ్రాల వ్యాపారులు, ఐటీ నిపుణులుగా పనిచేస్తున్నారు. డిమోనాలో భారతీయ పండగలైన దీపావళి, ఓనం వంటి పండగలు జరుపుకుంటారు. నవంబర్ 2025లో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్ట్‌లో నెల రోజుల పాటు జరిగిన సినిమా ప్రదర్శనలకు థియేటర్లు కిక్కిరిసిపోయాయి, కొన్ని నెలల క్రితం జరిగిన మొట్టమొదటి ఇండియన్ మ్యూజిక్ ఫెస్టివల్‌కు టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి.
ఇజ్రాయిల్ ‘‘అణు నగరం’’..
నెగెవ్ ఎడారిలో ఉన్న డిమోనాలోని షిమోన్ పెరెస్ నెగెవ్ అణు కేంద్రాన్ని ఇజ్రాయిల్ ను ఒక పరిశోధనా కేంద్రంగా ఉంది. 1958లో నిర్మాణం ప్రారంభమై, 1964 నాటికి ఇది ఆపరేషన్ స్థితికి వచ్చింది.
ఇజ్రాయిల్ దక్షిణ ప్రాంతమైన డిమోనా, అరద్‌పై ఇరాన్ శనివారం క్షిపణి దాడులు నిర్వహించింది. ఈ క్షిపణుల్ని ఇజ్రాయిల్ అడ్డుకోలేకపోయింది. నతాంజ్‌ను టార్గెట్ చేసినందుకే డిమోనాను టార్గెట్ చేసినట్లు ఇరాన్ చెప్పింది.
తాజావార్తలు
-
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
-
TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
-
Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
-
Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
-
C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!