Iran Warns Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్‌గా ఇరాన్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ట్రంప్ ఫ్లోరిడా నివాసం సేఫ్ కాదని.. అధ్యక్షుడు సన్‌బాత్ చేస్తున్న సమయంలో ఒక డ్రోన్ ట్రంప్‌ను ఢీకొట్టే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు. దీంతో, ఇరాన్ వ్యాఖ్యలపై ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. మరోవైపు, ఇరాన్ కామెంట్స్ కు ట్రంప్ సెటైరికల్ కౌంటర్ సైతం ఇవ్వడం గమనార్హం. ఇటీవల ఇరాన్- ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం కారణంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదే టైంలో ఇరాన్ అణు కేంద్రాలపై యూఎస్ సైన్యం కూడా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి.
Read Also: School Bus Fire Accident: స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..!
ఈ నేపథ్యంలో తమపై దాడులు చేసినందుకు డొనాల్డ్ ట్రంప్, అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. ఇక, తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు జావద్ లారిజాని తాజాగా ఓ ప్రోగ్రాంలో మాట్లాడుతూ.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌నకు ఇకపై ఆయన ఫ్లోరిడా ఇళ్లు కూడా సురక్షితం కాదు.. మార్-ఎ-లాగో రిసార్ట్‌లో అధ్యక్షుడు సన్‌బాత్ చేస్తున్న సమయంలోనే అతడిపై ఒక డ్రోన్‌తో దాడి చేయవచ్చని హెచ్చరించారు. ఇది తమకు చాలా సులభమైన పని అని పేర్కొన్నాడు. 2020లో ఇరానియన్ టాప్ జనరల్ ఖాసిం సులేమానీ హత్యలో డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారని ఆరోపిస్తూ ఆయన ఈ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇరాన్ మీడియాలో ఆయన వ్యాఖ్యలు ప్రసారం అయ్యాయి.
Larijani: "We can target Trump's navel!"
Javad Larijani, in a televised program, said:
"Trump can no longer sunbathe in Mar-a-Lago, because while he's lying down, a tiny drone might target his stomach and hit his navel!" pic.twitter.com/QOJfNlWpNL— Radio Faryad (@radiofaryad) July 8, 2025