Ajith and Sivakarthikeyan Cast His Vote For Lok Sabha Elections 2024: దేశవ్యాప్తంగా 44 రోజుల పాటు ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి విషయం తెలిసిందే. మొదటి విడతలో భాగంగా ఈరోజు 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలోని శాసనసభ స్థానాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచి పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు క్యూలో నిలబడి ఓటు వేశారు.
తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఈరోజు జరుగుతోంది. చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రజనీకాంత్ సిరా వేసిన తన వేలును చూపించి.. పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఆ సమయంలో అభిమానులు నినాదాలు చేస్తూ సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Also Read: Mansoor Ali Khan: నాకు పండ్ల రసంలో విషం కలిపి ఇచ్చారు.. మన్సూర్ అలీ ఖాన్ సంచలన ఆరోపణలు!
తమిళ్ స్టార్ హీరోలు అజిత్ కుమార్, శివకార్తికేయన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులోని శివగంగలో కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకుడు పీ చిదంబరం ఓటు వేశారు. సేలంలో తమిళనాడు మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి, చెన్నైలోని సాలిగ్రామంలో తమిళిసై సౌందర్‌రాజన్, తిరుచిరాపల్లిలో మంత్రి కేఎన్ నెహ్రూ, ఉతుపట్టిలో కే అన్నమళై తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
#WATCH | Actor Rajnikanth casts his vote at a polling booth in Chennai, Tamil Nadu.
#LokSabhaElections2024 pic.twitter.com/6Ukwayi5sv
— ANI (@ANI) April 19, 2024