ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత ఆరు రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చాయి. షియా మతాధికారుల కోట అయిన కోమ్‌కు చేరుకున్నాయి. దీంతో భద్రతా దళాలు అడ్డుకునేందుకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు ఆరుగురు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: US-Russia: పుతిన్ ఇంటిపై ఉక్రెయినే దాడి చేసింది.. అమెరికాకు ఆధారాలు అందించిన రష్యా
క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. ప్రస్తుతం డజన్ల కొద్ది నగరాల్లో నిరసనలు వ్యాప్తి చెందాయి. టెహ్రాన్, మషద్, ఇస్ఫహాన్, లోరెస్తాన్, ఖుజెస్తాన్ వంటి నగరాల్లో ఆందోళనలు ఉధృతం అయ్యాయి. అయతుల్లా ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. భద్రతా సిబ్బందితో నిరసనకారులు ఘర్షణకు దిగారు. ప్రస్తుతం నిరసనలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Karnataka: వెలుగులోకి కాంగ్రెస్ ఎన్నికల సర్వే.. రాహుల్‌గాంధీపై బీజేపీ విమర్శలు