ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత ఆరు రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చాయి. షియా మతాధికారుల కోట అయిన కోమ్‌కు చేరుకున్నాయి.
దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనమౌతోంది. ఇప్పటికే రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు రూపాయి విలువ కూడా జీవనకాల కనిష్ఠానికి చేరుకుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడగుంటుతున్నాయి. స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకుంటున్నాయి. మరోవైపు నిరుద్యోగం పెరిగిపోతోంది. ధరల మోత మోగిపోతోంది. ఎక్కడ చూసినా ప్రతికూల సంకేతాలే కనిపిస్తున్నాయి. సామాన్యుడి బతుకు మరింత భారంగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే గ్యాస్, డీజిల్, పెట్రోల్ రేట్లు ఆకాశమే హద్దుగా పరుగులు…