CM YS Jagan: చంద్రబాబు అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన సీఎం జగన్.. బాబు, పవన్‌పై సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: అంతా ఊహించినట్టుగా జరిగింది.. ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత తొలిసారి ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. నిడవోలులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను చంద్రబాబు లాగా మోసాలు చేయలేదన్నారు.. అవినీతి కేసులో అరెస్టయిన మహానుభావుడి గురించి నాలుగు మాటలు చెప్తా.. ఆలోచించండి అంటూ సూచించిన ఆయన.. ఇన్ని దొంగతనాలు చేసినా, ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా చంద్రబాబును రక్షించు కునేందుకు దొంగలా ముఠా ఉంది అని ఆరోపించారు.. కానీ, చట్టం ఎవరికైనా ఒక్కటే.. మాన్యుడికి ఎలాంటి శిక్ష పడుతుందో.. అదే శిక్ష రాజకీయ నాయకులకు వర్తిస్తుంది అని చెప్పేవాళ్లు చంద్రబాబుకు లేరు అని సెటైర్లు వేశారు.
ఇక, ఆడియో, వీడియో టేపుల్లో చంద్రబాబు దొంగగా అడ్డంగా దొరికినా కూడా దోపిడీ సొమ్ము అని ప్రజలకు అర్థం అయినా కూడా బాబు చేసింది నేరమే కాదని వాదించే వాళ్లు సిద్ధం అయ్యారని మండిపడ్డారు సీఎం జగన్.. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ఏ ఒక్కరూ రెడీగా లేరన్న ఆయన.. చంద్రబాబు దోచిన దాంట్లో వాటదారులు కాబట్టి.. ఇంత అన్యాయం జరుగుతున్న ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా.. అన్నవాడు ప్రశ్నించడు. ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం అనేది ఆలోచించాలని ప్రజలకు సూచించారు. ఫేక్ అగ్రిమెంట్ సృష్టించి నిబంధనలు పక్కన పెట్టి దోపిడీ చేశారు ఆరోపించారు వైఎస్ జగన్.. సీమెన్స్ తమకు డబ్బు ముట్ట లేదు అని చెప్పింది.. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆధారాలతో నిర్ధారించిందని పేర్కొన్నారు.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
చంద్రబాబు చేసిన తప్పులు ప్రశ్నించకుండా నేరుగా జైలుకు వెళ్లి ములాఖత్ లో మిలాఖత్ చేసుకుని పొత్తు పెట్టుకుంటారు అంటూ టీడీపీ-జనసేన పొత్తు విషయంలో పవన్ కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం జగన్.. ములాఖత్ లో మిలాఖత్ లు చేసుకునే వారి గురించి ప్రజలు ఆలోచించాలని సూచించారు. మీ బిడ్డ ప్రభుత్వ హయాంలో మీకు ఎంత లబ్ధి చేకోరిందో చూడాలని విజ్ఞప్తి చేశారు.. గత ప్రభుత్వం లో ఎంత ఆదాయం ఉందో, వైసీపీ ప్రభుత్వంలో అదే ఆదాయం ఉంది.. కోవిడ్ వచ్చినా 2 లక్షల 35వేల కోట్లు అక్క చెల్లెమ్మ ల ఖాతాలో వేశామని గుర్తుచేశారు. దత్త పుత్రుడు అండ ఉందని ఖండకావరం లేదు.. మీ బిడ్డకు ఇలాంటి వాళ్ళు లేరు.. ప్రజల అండ ఉంది.. జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో మీ బిడ్డ ఒక వైపు, అన్యాయం మరో ఉంది మీకు న్యాయం జరిగిందనిపిస్తేనే మీ బిడ్డకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు సీఎం వైఎస్ జగన్.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!