Trump-Modi: భారత్‌కు ట్రంప్ గుడ్‌న్యూస్.. జరిమానా సుంకం ఎత్తివేత
- భారత్‌కు ట్రంప్ గుడ్‌న్యూస్
- భారత్‌పై విధించిన 25 శాతం జరిమానా సుంకం ఎత్తివేత
- 18 శాతానికి సుంకం తగ్గిస్తున్నట్లు అమెరికా ప్రకటన
- తాత్కాలిక ముసాయిదా విడుదల చేసిన అమెరికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-అమెరికా మధ్య సంబంధాలు రోజురోజుకు బలపడుతున్నాయి. గత వారం భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం కార్యరూపం దాల్చింది. రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందంపై తాత్కాలిక ముసాయిదాను అమెరికా విడుదల చేసింది. ఇక రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై విధించిన 25 శాతం జరిమానా సుంకాన్ని ట్రంప్ ఎత్తేశారు. జరిమానాను పూర్తిగా ఎత్తేసినట్లుగా అమెరికా ప్రకటించింది. భారత్ వస్తువులపై సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లుగా అమెరికా అంగీకరించింది. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. అలాగే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే అనేక ఉత్పత్తులపై భారతదేశం సుంకాలను తగ్గిస్తుందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.
పీయూష్ గోయల్ ఎక్స్ పోస్ట్..
భారత్-అమెరికా ఒప్పందంతో భారతీయ చిన్న, మధ్య తరహా సంస్థలు, రైతులు, మత్స్యకారులకు ముప్పై ట్రిలియన్ డాలర్ల భారీ మార్కెట్‌కు దారి తీస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఎక్స్‌లో చెప్పారు. మహిళలు, యువతకు లక్షలాది ఉపాధి అవకాశాలను లభిస్తాయన్నారు. అమెరికా సుంకాలను 18 శాతానికి తగ్గించడం వల్ల వస్త్రాలు, తోలు, ప్లాస్టిక్ వంటి రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
ఇది కూడా చదవండి: Jogi Ramesh: జోగి రమేష్‌కు హైకోర్టులో ఊరట
జెనరిక్ మందులు, రత్నాలు, వజ్రాలు, విమాన విభాగాలు వంటి అనేక వస్తువులపై సుంకాలు సున్నాకి తగ్గించబడతాయని.. దీని ద్వారా ‘‘మేక్ ఇన్ ఇండియా’’ను మరింత బలపరుస్తుందని కేంద్రమంత్రి అన్నారు. తాజా ఒప్పందంతో రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తుందని చెప్పారు. గ్రామీణ జీవనోపాధిని నిలబెడుతుందన్నారు. మొక్క జొన్న, గోధుమ, బియ్యం, సోయా, పౌల్ట్రీ, పాలు, చీజ్, ఇథనాలు, పొగాకు, కొన్ని కూరగాయాలు, మాంసం మొదలైన సున్నితమైన వ్యవసాయ, పాల ఉత్పత్తులను పూర్తి రక్షణ కలిగిస్తుందని వివరించారు. ఈ ఒప్పందం భారత్-అమెరికా ఆర్థిక సహాకారాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని పీయూష్ గోయల్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
Union Commerce and Industries Minister Piyush Goyal tweets, "Under the decisive leadership of PM Narendra Modi, India has reached a framework for an Interim Agreement with the US. This will open a $30 trillion market for Indian exporters, especially MSMEs, farmers and fishermen.… pic.twitter.com/Suw5x5D5sw
— ANI (@ANI) February 7, 2026
తాజావార్తలు
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..