అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సుంకాలు కారణంగా ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోయాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. కోవిడ్ సమయంలో ఎదురైన భారీ పతనం.. మరోసారి ట్రంప్ టారిఫ్‌లు కారణంగా చవిచూశాయి. ఇక ట్రంప్‌నకు ధీటుగా చైనా కూడా సుంకాలు పెంచేసింది. దాదాపు 34 శాతం సుంకాలు పెంచింది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. చైనా భయపడిందని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: #Akhil 6 : టైటిల్ గ్లింప్స్ రిలీజ్ టైమ్ రివీల్ చేసిన నాగవంశీ..
తాజాగా ఇదే అంశంపై భారత్ స్పందించింది. అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించే అవకాశం ఉందా? అన్న అంశంపై క్లారిటీ వచ్చింది. భారత్ నుంచి ఎలాంటి ప్రతిచర్య ఉండబోదని ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. అయితే ట్రంప్ విధించిన టారిఫ్‌ల నుంచి ఉపశమనం పొందేందుకు మోడీ మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికే వాషింగ్టన్‌తో చర్చలు జరిపినట్లు తెలిపారు. ఒక విధంగా చెప్పాలంటే.. ఆసియా దేశాలతో పోలిస్తే మెరుగైన స్థానంలోనే ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Jammu and Kashmir: వక్ఫ్ చట్టంపై జమ్మూ అసెంబ్లీలో ఆందోళనలు.. ప్రతులను చింపివేసిన సభ్యులు
ఇదిలా ఉంటే ఆదివారం ట్రంప్ మాట్లాడుతూ.. వాణిజ్య యుద్ధాన్ని సమర్థించారు. కొన్ని సార్లు సమస్యలకు ‘ఔషధం’ అవసరం అంటూ వ్యాఖ్యానించారు. సుంకాలను తగ్గించే ప్రసక్తేలేదన్నారు. అయితే కొన్ని దేశాలు చర్చలకు వచ్చినట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. అందులో ఆసియా దేశాలు ఉన్నట్లుగా ట్రంప్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Ram Charan : ‘పెద్ది’ ఫస్ట్ షాట్.. హిస్టరీ క్రియెట్స్..