మంచి విజయం కోసం శ్రమిస్తున్న హీరోలలో అక్కినేని అఖిల్ ఒకరు. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉండి ఏం లాభం ఎంతో టాలెంట్ ఉన్నప్పటికి స్టార్ డమ్ మాత్రం రావడం లేదు. కథల విషయంలో పోరా పాటు అవుతుందా, లేక అఖిల్ నుంచి ప్రేక్షకులు ఇంకేమైన కోరుకుంటున్నారా అనే విషయం పక్కన పెడితే.. తన 9 ఎళ్ళ కెరీర్‌లో అభిమానులను మెప్సించడానికి చాలానే కష్టపడుతున్నాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ దర్శకుడు నందు అలియాస్ మురళీ కిషోర్ అబ్బూరు తో అఖిల్ సినిమా సెట్ చేసుకున్నాడు. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ముఖ్యంగా చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్‌ను నిర్వహించనున్నారు. నందు మొదటి సినిమా కూడా తిరుపతి బ్యాక్ డ్రాప్లోనే ఆడింది, దీంతో సెంటిమెంట్‌గా షూటింగ్ అక్కడి నుండే మొదలు కానుందట. అయితే తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ పై అప్‌డెట్ ఇచ్చాడు నాగవంశీ..
Also Read: Akkineni Akhil : ఎయిర్ పోర్టులో కొత్త జంట..
ఈ మధ్యకాలంలో నటీనటులు పుట్టినరోజుకు వారి కొత్త ప్రాజెక్ట్‌ల నుంచి కచ్చితంగా ఇంట్రస్టింగ్ అప్‌డెట్ ఇవ్వడం ఆనవాయితిగా వస్తుంది. ఇందులో భాగంగా రేపు అంటే ఏప్రిల్ 8న అఖిల్ పుట్టిన రోజు. దీంతో చిత్ర యూనిట్ ‘#Akhil 6 టైటిల్ గ్లింప్స్ 08.04.25న రివిల్ చేస్తున్నట్లు మూవీ టీం వెల్లడించింది. అలాగే పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ అఖిల్ చేయి మాత్రమే చూపించారు.
#Akhil6 – Title glimpse unveils on 08.04.25 ❤️🔥 @AkhilAkkineni8 @iamnagarjuna @KishoreAbburu @AnnapurnaStdios #ManamEntertainments @SitharaEnts pic.twitter.com/hzWltjRPsk
— Naga Vamsi (@vamsi84) April 7, 2025