Rome: భారతీయ సంప్రదాయానికి చీరకట్టు పెట్టింది పేరు. విదేశాల్లో సైతం చీరకట్టును అనుకరిస్తుంటారు. ఇక ఇండియా నుంచి వివిధ దేశాల్లో ఉంటున్న భారతీయ వనితలు ఈ చీరకట్టును గుర్తు చేస్తూ ఉంటారు. ఇక పండుగల సందర్భంగా అయితే చెప్పనవసరం లేదు. అలాంటి ఒక మహిళ తన పెళ్లి రోజు సందర్భంగా రోమ్‌లో చీరకట్టుతో వీధుల్లో సందడి చేసింది. ఆమె రోమ్ వీధుల్లో చీరకట్టుతో కలియ తిరిగింది. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ పల్లవి రాజ్ ఇంటర్‌నెట్‌లో షేర్ చేసిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది. ఈ వీడియోలో పల్లవి చీర కట్టుతో దేశీ అవతార్‌లో రోమ్ వీధుల్లో నడుస్తూ ఆకట్టుకున్నారు. తన మ్యారేజ్ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఆమె శారీతో వీధుల్లో తిరిగిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Read also: Danger Pilla: ఆమ్మో ‘డేంజర్ పిల్ల’ అంటున్న నితిన్
ఇన్‌స్టాగ్రాంలో ఆమె ఈ వీడియోను షేర్ చేయగా నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్టయ్యారు. పింక్ అండ్ గోల్డ్ శారీలో ఆమె మెరస్తుండగా అక్కడున్న వారంతా చప్పట్లు కొడుతూ ఫొటోలు తీయడంలో మునిగిపోయారు. పల్లవి షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకూ ఏకంగా 50 లక్షల మంది వీక్షించారు. నా తొలి వివాహ వార్షికోత్సవం సందర్భంగా శారీలో ముస్తాబయ్యాను. వీధుల్లో నడుచుకుంటూ నా దుస్తులపై ఇటాలియన్ల రియాక్షన్ను రికార్డు చేయాలని అనుకున్నామని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. పల్లవి విశ్వాసానికి, విదేశీ గడ్డపై అక్కడి వేషధారణను విడిచి చీరకట్టుతో సంప్రదాయ దుస్తుల్లో ముందుకు రావడం అభినందనీయమని పలువురు నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. భారత్‌లో ముఖ్యంగా యువత పాశ్చాత్య ధోరణులకు అలవాటుపడుతుండగా ఇలాంటి వీడియోలు మనకు గర్వంగా అనిపిస్తాయని మరికొందరు యూజర్లు రాసుకొచ్చారు. శారీ ధరించడం, సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబవ్వాలని అనుకోవడం నిజంగా గొప్పవిషయమని పలువురు యూజర్లు కామెంట్ చేశారు.