పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి ఆర్మీ చీఫ్, షాబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. పాకిస్థాన్‌ను బానిసలుగా మార్చే వారితో తాను ఎలాంటి రాజీపడబోనని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. 9 ఏళ్లు జైల్లో ఉండేందుకు సిద్ధమన్నారు.
పీటీఐ వ్యవస్థాపకుడు, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన లాయర్లను జైలులోనే ఒంటరిగా కలిసేందుకు ఇస్లామాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. జైలు హ్యాండ్‌బుక్ ప్రకారం.. ఇమ్రాన్‌ఖాన్‌ను ఒంటరిగా కలిసేందుకు న్యాయవాదులను అనుమతించాలని జైలు నిర్వాహకులను కోర్టు ఆదేశించింది.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై పోరులో తగ్గేది లేదు అంటున్నారు. ఇటీవల కాలంలో ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. తన బలాన్ని చూపించుకోవడానికి భారీ ఎత్తున ప్రదర్శనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ మెడకు చుట్టుకున్నాయి. ఆగస్టు 20న జరిగిన ర్యాలిలో మహిళా న్యాయమూర్తిని బెదిరిస్తూ.. వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై ఉగ్రవాద కేసు నమోదు అయింది.