Israel-Hamas War: ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమాయక ప్రజలు బలైపోతున్నారు. ఇరు దేశాలలో ప్రజలు అరచేతిలో ప్రాణాలను పెట్టుకుని బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నారు. అక్టోబరు 7న హమాస్ చిన్నపెద్ద తేడా లేకుండా విచక్షణ రహితంగా ఇజ్రాయిల్ పైన విరుచుకుపడింది. హమాస్ హింసాత్మక దాడుల్లో 1400 మంది పైగా చనిపోయారు. 200 మందిని అపహరించి తన అధీనంలో బంధించింది. హమాస్ ఉగ్రవాదులు అపహరించి బంధించిన 200 మందిలో ఇద్దరు అమెరికన్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు తన పౌరులను హమాస్ చర నుండి విడిపించేందుకు శాయశక్తులా కృషి చేశారు. చివరికి నిన్న శుక్రవారం హమాస్ ఉగ్రవాదులు ఇద్దరు అమెరికన్లను విడిచి పెట్టారు.
Read also:Nitika Pant IPS: టాస్క్‌ఫోర్స్ డీసీపీగా నితికా పంత్.. ఆ పోస్టులో మహిళను నియమించటం ఇదే తొలిసారి
దీనితో US అధ్యక్షుడు జో బైడెన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆనంతరం బైడెన్ విడుదలైన ఇద్దరు మహిళలతో ఫోన్‌లో మాట్లాడారు. హమాస్ చర నుండి ఆ ఇద్దరు అమెరికన్ మహిళలను విడిపించేందుకు అమెరికా ఖతార్ మరియు ఈజిప్ట్ తో సహాయం తీసుకుంది. కాగా విడుదలైన ఇద్దరు మహిళలు జుడిత్ తై రానన్ మరియు ఆమె కుమార్తె నటాలీ శోషనా రానన్ గా అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుతం విడుదలైన తల్లి కూతురు గాజా సరిహద్దులో ఒక ఇజ్రాయెల్ రాయబారిని కలుసుకున్నారు. కాగా సెంట్రల్ ఇజ్రాయెల్ లోని సైనిక స్థావరాల వద్ద వారిని కలవడానికి కుటుంబ సభ్యులు వేచి ఉన్నారు. కాగా ఖతార్ మరియు ఈజిప్ట్‌లు సంప్రదించిన తరువాత, (ఎజ్జెడిన్) అల్-కస్సామ్ బ్రిగేడ్‌లు మానవతా దృఖ్పధంతో ఇద్దరు అమెరికన్ పౌరులను విడుదల చేశాయి అని హమాస్ తెలిపింది.