హెల్త్ బాగుంటే అన్ని సంపదలు మీతో ఉన్నట్లే. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి. సమయానికి నిద్రాహారాలు ఉండేలా చూసుకోవాలి. యోగా, వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలి. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడానికి ప్రయత్నించాలి. రోగనిరోధక శక్తి ఉన్నట్లైతే వ్యాధులను దరిచేరనీయదు. కరోనా కారణంగా అందరిలో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. రోగనిరోధక శక్తి ఎంత ముఖ్యమో తెలిసొచ్చింది. హెల్తీగా ఉండాలంటే ఇమ్యూనిటీని పెంచుకోవడం తప్పనిసరి అని అంతా అర్థం చేసుకున్నారు.
కరోనా మహమ్మారి నేర్పిన అనుభవ పాఠాలతో ఆరోగ్యంపై దృష్టిసారిస్తున్నారు. రోగనిరోధక శక్తిని మెరుగుపర్చుకోవడానికి సరైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. అలాగే పండ్లు, డ్రైఫ్రూట్స్ లాంటి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. వీటితో పాటు ఇమ్యూనిటీని పెంచేందుకు పలు యోగాసనాలు కూడా ఉపయోగపడతాయి. యోగాసనాల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ ఏయే ఆసనాలు వేస్తే ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ఏయే ఆసనాలు ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అదితి ముద్ర:
ఇమ్యూనిటీ పవర్ను పెంచడంలో ఈ ఆసనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ముద్ర సాధనతో శరీర సహజ రక్షణ వ్యవస్థ బ్యాలెన్స్ అవుతుంది. శ్వాసకోశ వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది.
వజ్ర ముద్ర:
ఈ ఆసనం ప్రాక్టీస్ చేస్తే ఇమ్యూనిటీ పవర్ పెరగడమే గాక శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఆహారాన్ని జీర్ణం చేయడంలోనూ ఇది సాయపడుతుంది. అలాగే రక్త ప్రసరణను కూడా సమతుల్యం చేస్తుంది.
ప్రాణ ముద్ర:
దీని వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. శరీరంలో నిద్రాణంగా ఉన్న శక్తిని యాక్టివేట్ చేసే సత్తా ఈ ముద్రకు ఉంది.
ఆది ముద్ర:
ఈ ఆసనం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఇమ్యూనిటీని పెంచడంతో పాటు నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలోనూ ఉపయోగపడుతుంది. ఈ ముద్ర సాధన చేయడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం, అవి పనిచేసే తీరు కూడా మెరుగుపడుతుంది. ఈ ఆసనం ఉదయం లేదా సాయంత్రం పూట మాత్రమే చేయాలి. సూర్యుడి వెలుతురు ఉన్నప్పుడే దీన్ని సాధన చేయాలి.
గమనిక: ఇది మీ అవగాహన కోసం మాత్రమే. ఈ ఆసనాలు సాధన చేసే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.