France Heatwave: ఫ్రాన్స్‌ను హడలెత్తిస్తోన్న ఎండలు.. వెయ్యికి చేరిన మృతులు
- ఫ్రాన్స్‌ను హడలెత్తిస్తోన్న ఎండలు
- వెయ్యికి చేరిన మృతులు
- అమెరికానే కారణమంటూ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐరోపా దేశాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు భగభగ మండిపోతున్నాడు. తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు అల్లాడపోతున్నారు. అనేక మంది రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. దాదాపుగా 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వాస్తవంగా భారత్ సహా ఆసియా దేశాల్లో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం మామూలు విషయమే కానీ.. ఐరోపా దేశాల్లో ఈ స్థాయిలో నమోదు కావడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. దీంతో ఇప్పటి వరకు ఫ్రాన్స్‌లో 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది ఆస్పత్రుల పాలయ్యారు.

Also Read
ఇదిలా ఉండగా పారిస్‌లో కొనసాగుతున్న వేడిపై అమెరికా జర్నలిస్టులు, ఇన్ఫ్టుయెన్సర్లు అపహాస్యం చేస్తున్నారు. దీంతో ఫ్రాన్స్‌లో వేడికి అమెరికానే కారణంగా అంటూ ఫ్రాన్స్ దుమ్మెత్తిపోస్తోంది. మా ప్రతి గదిలో ఎయిర్ కండిషనింగ్ ఎందుకు లేదని విమర్శించారు. ప్రపంచంలో గ్రీన్హౌస్ వాయువులను అత్యధికంగా విడుదల చేసే దేశాల్లో మీరు రెండవ స్థానంలో ఉన్నారని ఫ్రాన్స్‌కు చెందిన పారిస్ డిప్యూటీ మేయర్ పల్వర్ సోషల్ మీడియాలో విమర్శించారు.
చాలా మంది అమెరికన్లు.. ఫ్రాన్స్‌లో ఎయిర్ కండిషనింగ్ ఎందుకు లేదని ప్రశ్నిస్తూ విమర్శించారు. వాస్తవానికి జర్మనీలో కేవలం 7 శాతంతో పోలిస్తే.. ఫ్రాన్స్‌లో సగటు ఎయిర్ కండిషనింగ్ కేవలం 25 శాతం మాత్రమే. ఫ్రాన్స్, జర్మనీలోని చాలా ఇళ్లు, కార్యాలయాల్లో ఎయిర్ కండిషనింగ్ ఉండదు. కూలర్లు, ఫ్యాన్లను కూడా అరుదుగా ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో అమెరికన్లు.. ఫ్రాన్స్‌ను ఎగతాళి చేశారు. దీంతో పారిస్ డిప్యూటీ మేయర్ ఆడ్రీ పుల్వర్ ప్రతిస్పందించారు. ఫ్రాన్స్‌లోని తీవ్రమైన వేడిమి, వడగాలులకు అమెరికానే కారణమని ఆరోపించారు. అమెరికా అత్యధిక కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే దేశమని.. ఇది గ్లోబల్ వార్మింగ్‌కు, తత్ఫలితంగా యూరప్‌లోని వేడికి కారణమవుతోందని పుల్వర్ వాదించారు.
ఇదిలా ఉంటే ఇప్సోస్ సర్వే ప్రకారం.. 78 శాతం మంది ఫ్రెంచ్ ప్రజలు ఎయిర్ కండిషనింగ్ వాడటం మంచిది కాదని నమ్ముతున్నారు. సర్వేలో పాల్గొన్న ప్రతి ఆరుగురిలో ఒకరు మాత్రమే ఎయిర్ కండిషనర్ వాడటం ఫర్వాలేదని చెప్పారు. కొంత వేడిని తట్టుకోవడం ఫర్వాలేదు కానీ.. పర్యావరణం కోసం దాని వాడకాన్ని నివారించడం చాలా ముఖ్యం అని అన్నారు. అయితే గత వారం తీవ్రమైన వేడి ప్రజల అభిప్రాయాలను మార్చింది. పెద్ద సంఖ్యలో ప్రజలు దుకాణాలకు తరలివచ్చి ఎయిర్ కండిషనర్లను కొనుగోలు చేశారు.
తాజావార్తలు
-
Nepal Floods: 538కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య..
-
Irumudi: మాస్ మహారాజా రవితేజ ఊచకోత.. 135 కోట్లతో ‘ఇరుముడి’ ఫస్ట్ వీక్ సెన్సేషన్!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
-
Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్‌కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!