School Teacher: అమెరికాలో దారుణం జరిగింది. మైనర్ విద్యార్థిపై ఓ మహిళా ఉపాధ్యాయురాలు లైంగిక వేధింపులకు పాల్పడింది. మోంట్గోమెరి కౌంటీ పోలీసుల ప్రకారం.. 2015లో 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడితో 22 ఏళ్ల మెలిస్సా మేరి కర్టిస్ అనే ఉపాధ్యాయురాలు లైంగిక చర్యలు జరిపింది. ప్రస్తుతం ఈమె వయసు 31 ఏళ్లు. ఈ విషయం బయటకు రావడంతో ప్రస్తుతం పోలీసులు ఆమెపై విచారణ ప్రారంభించారు.
Read Also: ENG vs NED: నెదర్లాండ్స్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
తను మైనర్‌గా ఉన్నప్పుడు అప్పర్ మార్లోబోరోకు చెందిన మెలిస్సా మేరీ కర్టిస్ తనతో లైంగిక సంబంధం పెట్టుకుందని బాధితుడు ఆరోపించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 2015 జనవరి నుంచి మే మధ్యకాలంలో తనపై లైంగిక దాడి మొదలైందని బాధితుడు వెల్లడించారు. సదరు ఉపాధ్యాయురాలు కర్టిస్ తన కారులో, ఇతర నివాసాల్లో బాలుడితో సెక్స్ చేసినట్లు, విద్యార్థికి గంజాయి, మద్యం అందించి లైంగిక దాడి జరిపినట్లు, 20 కన్నా ఎక్కువ సార్లు ఇలా జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. కర్టిస్ రెండు సంవత్సరాలు లేక్ ల్యాండ్ పార్క్ మిడిల్ స్కూలులో ఉపాధ్యాయురాలిగా ఉంది.
ఈ కేసులో అక్టోబర్ 31న ఆమెకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఆమెపై కేసు నమోదు చేశారు. మరికొందరు కర్టిస్ బాధితులుగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 2017 నుంచి కర్టిస్ తమ స్కూ్ల్ లో పనిచేయడం లేదని మాంట్ గోమెరీ కౌంటీ పబ్లిక్ స్కూల్ వెల్లడించింది.