Electric Cars: పంచ్ నుంచి సైరోస్ వరకు.. 2026లో వస్తున్న టాప్-5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే..
- 2026లో లాంచ్ అవుతున్న టాప్-5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే..
- టాటా పంచ్ నుంచి కియా సైరోస్ వరకు..
- మారుతి సుజుకీ, టయోటా నుంచి ఈవీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Electric Cars: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతోంది. అన్ని కార్ కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ వాహనాలు(EV)లను విడుదల చేస్తున్నాయి. మారుతీ సుజుకి, టాయోటా, టాటా, కియా వంటి ప్రముఖ బ్రాండ్లు 2026లో తన ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్‌లోకి దించుతున్నాయి. 2026లో వస్తున్న టాప్-5 EVలలో ఈ కార్లు ఉన్నాయి.
1) టాటా పంచ్ EV (Tata Punch EV (2026 Facelift):
Also Read
- Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
- EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్‌లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
- BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్‌తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
- Hero Glamour X 125: హీరో గ్లామర్ ఎక్స్ 125 కొత్త అప్డేట్తో లాంచ్.. రైడింగ్ మోడ్లతో పాటు క్రూయిజ్ కంట్రోల్, ABS!
ఎలక్ట్రిక్ కార్‌లలో టాటా దేశంలో మొదటిస్థానంలో ఉంది. ఇప్పటికే టాటా నెక్సాన్, పంచ్, టియాగో, టిగోర్, హారియర్ ఈవీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ఫిబ్రవరి 20, 2026లో లాంచ్ కాబోతోంది. గతంలో పోలిస్తే మరిన్ని టెక్ ఫీచర్లు, స్టైలిష్ డిజైన్‌తో రాబోతోంది. పంచ్ ఈవీ 25 kWh, 35 kWh బ్యాటరీ ప్యాక్స్ కలిగి ఉంటుంది. మొదటిది 82 hp, 114 Nm పవర్ జనరేట్ చేస్తుంది, 265 km రేంజ్ ఇస్తుంది. 35 kWh బ్యాటరీ ప్యాక్ 122 hp, 190 Nm పవర్‌తో 365 km రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
2) టాటా సియెర్రా EV (Tata Sierra EV):
కార్ లవర్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న టాటా సియెర్రా ఈవీ కూడా ఈ ఏడాది మొదటి అర్థభాగంలో లాంచ్ కాబోతోంది. ఇది Acti.EV+ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మితమవుతోంది. 55 kWh, 65 kWh బ్యాటరీ ఆప్షన్స్ కలిగి ఉంటుంది. ఇప్పుడు ఉన్న పెట్రోల్-డీజిల్ వేరియంట్‌తో పోలిస్తే సియెర్రా ఈవీ మరింత స్టైలిష్ లుక్‌తో రాబోతున్నట్లు సమాచారం. ఇది డ్యుయల్ మోటార్, ఆల్ వీట్ డ్రైవ్(AWD) ఆప్షన్స్ కలిగి ఉంటాయి.
3) మారుతీ సుజుకి ఈ విటారా(Maruti Suzuki e Vitara):
మారుతీ సుజుకి కూడా తన తొలి ఎలక్ట్రిక్ SUVని తీసుకురాబోతోంది. మారుతి సుజుకీ ఈ విటారా ఈ ఏడాది విడుదల కానుంది. ఇది హ్యుందాయ్ క్రేటా ఈవీ, మహీంద్రా BE6, టాటా కర్వ్ ఈవీలకు పోటీ ఇవ్వనుంది. ఈ కార్ 49 kWh, 61 kWh బ్యాటరీ ఆప్షన్లను కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 543 కి.మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇప్పటికే ఈ కార్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది.
4) టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా (Toyota Urban Cruiser Ebella):
టాయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా పేరుతో ఎలక్ట్రిక్ కారును విడుదల చేయబోతోంది. ఇది మారుతి సుజుకి ఈ విటారాను పోలి ఉంటుంది. అయితే, టయోటా తన సొంత ఫీచర్లను ఇందులో జోడించింది. ఈ SUVని 2026లో విడుదల కానుంది. ఇది కూడా 49 kWh, 61 kWh బ్యాటరీ ఆప్షన్లను కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 543 కి.మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే ఈ కార్ 2 వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్లను కలిగి ఉంటుంది.
5) కియా సైరోస్ EV (Kia Syros EV):
కియా ఇండియా గతేడాది ఫిబ్రవరిలో భారత మార్కెట్‌లోకి సైరోస్ ఎస్‌యూవీని తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ బ్రాండ్ సైరోస్‌ను ఈవీ అవతార్‌లో ఈ ఏడాది మార్కెట్‌లో విడుదల చేయబోతోంది. కియా స్పెషల్ కనెక్టెడ్ ఫీచర్లు, ఎక్కువ రేంజ్, స్టైలిష్ డిజైన్‌తో ఈ కారు రాబోతోంది. ఫ్యామిలీకి అనుగుణంగా మిడ్ సైజ్డ్ SUV సెగ్మెంట్ EVగా కియా సైరోస్ ఈవీ రాబోతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!