జర్మన్ స్టార్టప్ ఇసార్ ఏరోస్పేస్ ప్రయోగించిన తొలి రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఆదిలోనే హంసపాదు ఎదురైంది. స్పేస్ సెంటర్ నుంచి పైకి ఎగిరిన 18 సెకన్లలోనే ప్రయోగం విఫలమైంది. తిరిగి 40 సెకన్లలోనే నేల కూలిపోయింది.
బ్రెజిల్‌లోని సావో పాలో నగరంలో రద్దీగా ఉండే ప్రాంతంలో చిన్న విమానం కూలిపోయింది. బస్సును ఢీకొట్టడంతో మంటలు అంటుకుని ఇద్దరు చనిపోయారు. రోడ్డుపైన దూసుకుంటూ వెళ్లి బస్సును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి.
శుక్రవారం ఉదయం తిరువనంతపురం విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఇక్కడ అకస్మాత్తుగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పొగ వ్యాపించాయి. విమానంలో అలారం మోగింది.
ఇటలీలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. టేకాఫ్‌కు సిద్ధపడుతుండగా హఠాత్తుగా విమానంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పైలట్, సిబ్బంది.. ప్రయాణికులను కిందకు దించేశారు. దీంతో ఘోర ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఎయిర్ కెనడాకు భారీ ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులతో పాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎయిర్ కెనడాకు చెందిన బోయింగ్ ఏసీ 872 విమానం జూన్ 5న కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా విమానంలో కుడివైపు ఇంజిన్‌లో పేలుడు సంభవించింది.