Fiji Prime Minister Sitiveni Rabuka Trips While Looking At Phone: కేవలం వాహనాలు నడుపుతున్నప్పుడే కాదు, మనం నడుస్తున్నప్పుడు కూడా మొబైల్ ఫోన్లను పక్కన పెట్టడం శ్రేయస్కరం. ఒకవేళ మొబైల్ ఫోన్ మోజులో పడి నడుచుకుంటూ వెళ్తే.. ఏదైనా ప్రమాదం జరగొచ్చు. గతంలో కొన్ని యాక్సిడెంట్‌లో చోటు చేసుకోవడం, జనాలు గోతిలో పడటం వంటి సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు సాక్షాత్తూ ఫిజీ ప్రధానమంత్రి సితివేణి రబుకా సైతం ఈ మొబైల్ ఫోన్ మోజులో పడి, మెట్ల మీద నుంచి జారిపడ్డారు. సెల్‌ఫోన్ చూస్తూ నడిచిన ఆయన మెట్లు దిగడాన్ని గమనించలేదు. దీంతో జారి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు దెబ్బతగిలింది. దీంతో.. తన చైనా పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఫిజీలోని చైనా రాయబార కార్యాలయంతో పాటు స్వయంగా ప్రధాని రబుకా వెల్లడించారు.
Alien Craft: ఏలియన్స్ ఉన్నాయి.. అమెరికా సాక్ష్యాలు దాచుతోంది
తనకు ఎదురైన ఈ ఘటనపై ప్రధాని రబుకా ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆయన ఫోన్ చూస్తుండగా జారిపడ్డానని, ఫలితంగా తలకు గాయమైందని, దీంతో చైనా పర్యటనని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. ‘‘బుధవారం ఉదయం ప్రభుత్వానికి చెందిన కొత్త బిల్డింగ్ ప్రవేశ ద్వారం వద్ద నేను మొబైల్ చూస్తూ పొరపాటున మెట్లు జారి కిందపడ్డాను. ఈ ప్రమాదంలో తలకు గాయమైంది. దీంతో నా సిబ్బంది నన్ను ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందించారు. ఇప్పుడే నేను ఆసుపత్రి నుంచి తిరిగొచ్చాను’’ అని రబుకా ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోలో ఆయన చొక్కాపై కొద్దిగా రక్తపు మరకలు ఉండటాన్ని గమనిస్తే.. ఆయనకు గట్టిగానే దెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. కాగా.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కలిసి గెంగ్డూలో జరిగే ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల ప్రారంభోత్సవానికి ఫిజీ ప్రధాని హాజరు కావాల్సి ఉంది. కానీ.. ఈ ఘటన కారణంగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది.