Former US Intelligence Agent David Grusch Claims Aliens Exist: ఏలియన్స్ ఉన్నాయా? లేవా? ఈ మిస్టీరియస్ ప్రశ్నకు ఇంతవరకూ సమాధానం లేదు. గతంలో యూఎఫ్ఓలు భూమి మీద సంచరించాయని కథనాలైతే ఉన్నాయి కానీ, అందుకు సాక్ష్యాలు లేవు. వీటి అన్వేషణ కోసం శాస్త్రవేత్తలు తమ అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ సౌర కుటుంబంలో ఎక్కడో ఒక చోట గ్రహాంతర వాసులు ఉండనే ఉంటారని చాలామంది నమ్ముతుంటే, ఇవన్నీ కట్టుకథలేనని కొందరు కొట్టిపారేస్తుంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ డిబేట్ కొనసాగుతూనే ఉంది.
Janhvi Kapoor: ఆష్విట్జ్ వివాదంపై జాన్వీ స్ట్రాంగ్ కౌంటర్
ఇలాంటి తరుణంలో.. అమెరికా మాజీ నిఘా అధికారి డేవిడ్ గ్రుష్ ఏలియన్స్ ఉన్నాయంటూ సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. ఈ భూమి మీద ఎలాగైతే మనుషులు ఉన్నారో, ఇతర గ్రహాల్లోనూ జీవులు ఉన్నాయని ఆయన కుండబద్దలు కొట్టాడు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు అమెరికా దగ్గర ఉన్నాయని కూడా బాంబ్ పేల్చాడు. అయితే.. ఆ సాక్ష్యాలు బయటకు రాకుండా అమెరికా దాచిపెడుతోందని ఆరోపించాడు. యూఎఫ్‌వోలతో పాటు అందులో నుంచి సేకరించిన మానవేతర అవశేషాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను నిఘా వర్గాలు గతంలోనే ప్రభుత్వానికి సమర్పించాయని ఆయన తెలిపారు.
Anju-Nasrullah: అంజు-నస్రుల్లా ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్.. ఆలు లేదు చూలు లేదు
వాషింగ్టన్‌లో ఓ కమిటీ ముందు బుధవారం ఈ వాంగ్మూలం ఇచ్చిన డేవిడ్.. క్రాష్డ్ క్రాఫ్ట్స్, దాని పైలట్లు నిజమేనని పేర్కొన్నారు. దీని గురించి తనకు ప్రత్యక్ష సమాచారం ఉందని.. దశాబ్దాలుగా వీటిపై పరిశోధనలు కొనసాగుతున్నాయని తెలియజేశారు. 1930 నుంచే మానవేతర కార్యకలాపాల గురించి అమెరికా తెలుసుకునే అవకాశం ఉందన్నారు. తాను ప్రత్యక్షంగా వాటిని చూడకపోయినా.. హైలెవల్ ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి తనకు సమాచారం ఉందన్నారు. మరోవైపు.. డేవిడ్ గ్రుష్ వాదనలను అమెరికా రక్షణ విభాగం ఖండించింది. గ్రహాంతర వాసులు, వారికి వస్తువుల ఉనికిపై ధ్రువీకరించదగిన సమాచారం పరిశోధకులు కనుగొనలేదని పేర్కొంది.