Janhvi Kapoor Gives Strong Counter on Auschwitz Issue: అందరూ కాదు కానీ, కొందరి నైజం మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది. సమాజంలో జరిగే అన్యాయంపై వాళ్లు నోళ్లు మెదపడం కాదు కదా, చూసీ చూడనట్టు ఉంటారు. కానీ.. సినిమాలో ఏదైనా లోపం ఉంటే మాత్రం, దండయాత్ర చేయడానికి వచ్చేస్తారు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి, వెంటనే తొలగించాలంటూ పెద్ద వివాదానికే దారితీస్తారు. ఇప్పుడు బవాల్ సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది కానీ, ఆష్విట్జ్‌తో ముడిపడి ఉన్న సీన్లపై మాత్రం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సీన్లను తొలగించాలని, లేకపోతే సినిమానే ఓటీటీ నుంచి తీసెయ్యాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జాన్వీ రంగంలోకి దిగి.. విమర్శలు చేస్తున్న వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
Anju-Nasrullah: అంజు-నస్రుల్లా ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్.. ఆలు లేదు చూలు లేదు
ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమంగా ఈ వివాదంపై జాన్వీ కపూర్ స్పందిస్తూ.. ‘ఇజ్రాయెల్ దేశస్థుడైన ఒక వ్యక్తి నాకు తెలుసు. ఐవీ లీగ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అయిన అతని పూర్వీకులు దురదృష్టవశాత్తు నాజీల నిర్బంధంలో ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల అతను మా బవాల్ సినిమాని చూశాడు. ఈ సినిమా చూశాక ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మేము తీసిన విధానాన్ని ఆయన అర్థం చేసుకొని, సినిమా చాలా బాగా తెరకెక్కించారని కొనియాడారు. అంతేకాదు.. ఈ సినిమాపై ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. ఏ ఒక్క సన్నివేశం కూడా బాధించేలా ఉందని ఆయన చెప్పలేదు. కాబట్టి.. ఏదైనా ప్రేక్షకుల దృష్టి కోణంపైనే ఆధారపడి ఉంటుంది.రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన నష్టాన్ని చూపించడమే మా లక్ష్యం. మా ఉద్దేశాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటే.. నేనేం చేయలేను. ఈ సినిమాలోని నా పాత్రను చూసి పలువురు విద్యార్థులు చలించిపోయారు. వాళ్లకు ధైర్యం వచ్చిందని చెప్పగానే, నాకెంతో గర్వంగా అనిపించింది’’ అంటూ చెప్పుకొచ్చింది. సింపుల్‌గా చెప్పాలంటే.. నోరేసుకొని పడిపోవడం కాదు, సినిమాని అర్థం చేసుకోని మాట్లాడమని ఇండైరెక్ట్‌గా జాన్వీ కౌంటర్ ఇచ్చిందన్నమాట.
Karnataka Crime: నిందితుల్ని పట్టించిన బీర్ బాటిల్ మూత.. కథలో మరో షాకింగ్ ట్విస్ట్
ఇంతకీ.. ఆష్విట్జ్ అంటే ఏంటో తెలుసా? రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలు ఏర్పాటు చేసిన నిర్బంధ క్యాంపులనే ఆష్విట్జ్ అంటారు. ఈ క్యాంపుల్లో యూదులను వాళ్లు నిర్బంధించి.. చిత్రహింసలు పెట్టేవారు. ఈ ఆష్విట్జ్‌లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. నాటి పరిస్థితులను తెలియజేస్తూ.. ఈ బవాల్ సినిమాని తెరకెక్కించారు. అయితే.. ఇందులో ఆష్విట్జ్ క్యాంపులను చూపించడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు చిత్రబృందం తమదైన వివరణ ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే జాన్వీ పై విధంగా స్పందించింది.